విద్యార్థి హాజరు రియల్ టైమ్ గవర్నెన్స్ లోకి రావాల్సిందే... మంత్రి గంటా
విజయవాడ : రాష్ట్రంలో కేజీ నుంచి పీజీ వరకు చదివే ప్రతి విద్యార్థి హాజరు రియల్ టైమ్ గవర్నెన్స్ లోకి రావాల్సిందేనని రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. బయోమెట్రిక్ అమలుపై నిర్వహించిన పాలిటెక్నిక్ క
విజయవాడ : రాష్ట్రంలో కేజీ నుంచి పీజీ వరకు చదివే ప్రతి విద్యార్థి హాజరు రియల్ టైమ్ గవర్నెన్స్ లోకి రావాల్సిందేనని రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. బయోమెట్రిక్ అమలుపై నిర్వహించిన పాలిటెక్నిక్ కళాశాలల ప్రిన్సిపాళ్ల సమావేశంలో సోమవారం మంత్రి గంటా మాట్లాడారు. సీఎం చంద్రబాబు నాయుడు విజన్‌కి అనుగుణంగా పనిచేయాలని, ప్రతిదీ ఇప్పుడు రియల్ టైమ్ గవర్నర్స్‌లో అనుసంధానం అవుతోందన్నారు.
టెక్నాలజీలో మన రాష్ట్రం దేశానికే తలమానికంగా వుందని, అందుకే ఇదే విషయంపై సీఎం చంద్రబాబును ముస్సోరిలో ఐఏఎస్‌ల సమావేశంలో మాట్లాడేందుకు ఆహ్వానించారని అన్నారు. విద్యాశాఖలో బయోమెట్రిక్ హాజరును పూర్తిస్థాయిలో చేపట్టాలని కలెక్టర్ల సమావేశంలో సీఎం ప్రస్తావించిన విషయాన్ని మంత్రి గంటా గుర్తుచేశారు. రాష్ట్రంలో 1,02,25,950 మంది విద్యార్థులు వున్నారని వీరందరి హాజరును రియల్ టైమ్ గవర్నెన్స్ లోకి ఇంటిగ్రేటెడ్ చేయాలన్నారు.
పైలెట్ ప్రాజెక్టు కింద 81 పాలిటెక్నిక్ కళాశాల్లో ఇంటిగ్రేటెడ్ అటెండెన్స్ మేనేజ్‌మెంట్ సిస్టమ్(IAMS)ను ప్రవేశపెట్టారని, దీని ఫలితాలు బాగున్నాయని వివరించారు. మరో 232 కళాశాలల్లో ఈ విధానం అమలవుందని స్పష్టం చేశారు. బయోమెట్రిక్ అటెండెన్స్‌కు సంబంధించి ఈ విధానం బాగుండటం వల్లే మిగతా పాఠశాల, ఇంటర్ విద్యాశాఖల్లోనూ ఈ విధానం అమలుకు చర్యలు చేపట్టాలని సూచించామని తెలిపారు. ఐ కామ్ ఈ బయోమెట్రిక్ హాజరును నిర్వహిస్తోందన్నారు.
విద్యారంగలో బయోమెట్రిక్ అమలుకు పూర్తిస్థాయిలో చర్యలు చేపడుతున్నామని, తక్కువ ఖర్చులో ఈ విధానాన్ని అమలు చేసేందుకు వివిధ ఏజెన్సీలను పరిశీలించి నిర్ణయాలు తీసుకుంటున్నామని మంత్రి గంటా తెలిపారు. విస్తృతంగా విద్యార్థుల సంఖ్య వుండటంతో కొన్ని కొన్ని ఇబ్బందులు వస్తున్నా... సమస్యను పరిష్కరిస్తూ ముందుకెళుతున్నామన్నారు. ఏది ఏమైనప్పటికీ వంద శాతం బయోమెట్రిక్ అమలు చేస్తామని మంత్రి గంటా స్పష్టం చేశారు. ఆధార్ అనుసంధానించే సమయంలో ఎదురువుతున్న ఇబ్బందులను మంత్రి గంటా ఈ సందర్భంగా అడిగి తెలుసుకున్నారు.
ఇంటిగ్రేటెడ్ అటెండెన్స్ మేనేజ్‌మెంట్ సిస్టమ్(IAMS) మొబైల్ యాప్‌ను మంత్రి గంటా ప్రారంభించారు. మొబైల్‌లో హాజరును పర్యవేక్షించేందుకు ఈ యాప్ వినియోగించనున్నారు. క్షేత్రస్థాయిలో బయోమెట్రిక్ అటెండెన్స్ అమలుపై మంత్రి గంటా... ఈ సందర్భంగా ప్రిన్సిపాళ్లతో మాట్లాడారు. సమావేశంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, ఇంటర్మీడియట్ విద్యాశాఖ కమీషనర్ బి.ఉదయలక్ష్మీ, కళాశాల, సాంకేతిక విద్యాశాఖ కమీషనర్ పాండా దాస్, పాఠశాల విద్యాశాఖ కమీషనర్ సంధ్యారాణి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.