దేవుడు అన్నీ చూస్తున్నాడు... దేవుడు శిక్షిస్తాడు : చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆగ్రహం

ఠాగూర్
మంగళవారం, 1 జులై 2025 (22:22 IST)
తమపై తప్పుడు కేసులు పెట్టి అన్యాయంగా జైలుకు పంపించారని, దేవుడు అన్ని చూస్తున్నాడని, అన్యాయంగా తప్పుడు కేసులు పెడుతున్న వారిని ఆ దేవుడు శిక్షిస్తాడు.. కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుంది అని వైకాపా నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు. 
 
ఏపీలో సంచలనం సృష్టించిన మద్యం స్కామ్ కేసు విచారణలో మంగళవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మరో నిందితుడు వెంకటేశ్ నాయుడులను ప్రత్యేక దర్యాప్తు బృందం మంగళవారం ఉదయం తమ కస్టడీలోకి తీసుకున్నారు. మూడు రోజులపాటు వీరిని విచారించేందుకు ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చిన విషయం తెల్సిందే. 
 
దీంతో విజయవాడ సబ్ జైలులో రిమాండ్‌లో ఉన్న వీరిద్దరినీ సిట్ అధికారులు ముందుగా వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత సిట్ కార్యాలయానికి తీసుకెళ్లి విచారణ ప్రారంభించారు. కోర్టు ఆదేశాల మేరకు ప్రతి రోజూ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు వీరివద్ద విచారణ జరుపుతారు. ఈ మూడు రోజుల విచారణలో లిక్కర్ స్కామ్‌కు సంబంధించిన కీలక సమాచారాన్ని రాబట్టేందుకు సిట్ అధికారులు ప్రయత్నించనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా బడ్జెట్ రూ.50 లక్షలు - వసూళ్లు రూ.100 కోట్ల దిశగా...

ద్రౌపది 2 నుంచి ద్రౌపది దేవీగా రక్షణ ఇందుచూడన్ ఫస్ట్ లుక్

Pawan: చిన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్, దర్శకుడిగా కృష్ణవంశీ కి ఫ్యాన్ : మహేశ్ బాబు పి

Vijay Sethupathi: విజయ సేతుపతి, పూరి జగన్నాథ్ సినిమా షూటింగ్ పూర్తి

Nikhil: నిఖిల్...స్వయంభు మహా శివరాత్రికి థియేటర్లలో రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments