Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం.. సినిమా వాళ్లకు షాకింగ్ న్యూస్

Webdunia
బుధవారం, 7 జులై 2021 (17:49 IST)
ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. సినీ పెద్దల డిమాండ్లను పక్కన పెడుతూ జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ వ్యాప్తంగా ఇక నుంచి ప్రభుత్వ ఆదేశాల మేరకు మాత్రమే సినిమా హళ్లలోని వివిధ కేటగిరీల టికెట్ ధరల్ని నిర్ణయించాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు సినిమా నియంత్రం చట్టం 1955 ప్రకారం జారీ చేసిన 1273 జీవోను సవరిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. 
 
దీనిపై గతంలో పెను దుమారం రేగింది. ముఖ్యంగా తిరుపతి ఉప ఎన్నిక ముందు వకీల్ సాబ్ సినిమా రిలీజ్‌ను అడ్డుకోడానికి ఏపీ ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకుందని జనసేన కార్యకర్తలు, పవన్ అభిమానులు ఆందోళన చెందారు. 
 
పార్టీలకు అంతీతంగా మాజీ సీఎం చంద్రబాబు, బీజేపీ నేతలు సైతం ప్రభుత్వం తీరును తప్పుపట్టారు. అటు చిరంజీవి అధ్యక్షతను సీనీ పెద్దలు సీఎం జగన్‌కు కలిసి.. రేట్ల విషయంలో వెసులు బాటు ఇవ్వాలని కోరినట్టు కూడా ప్రచారం ఉంది. 
 
అయితే తరువాత కరోనా పరిస్థితుల నేపథ్యంలో థియేటర్లు మూతపడడంతో వివాదం సద్దుమణిగింది. మరోవైపు వకీల్ సాబ్ సినిమా హిట్ అయినా.. ప్రభుత్వం నిర్ణయం కారణంగానే నష్టాలు వచ్చేయనే ప్రచారం కూడా ఉంది. ఇలాంటి సమయంలో ప్రభుత్వం తాజా ఉత్తర్వులు మరోసారి రాజకీయ రచ్చకు దారి తీసే అవకాశం ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బ్రహ్మా ఆనందం నుంచి లిరికల్ సాంగ్ ఆనందమానందమాయే.. రిలీజ్

నేను మీ నాగార్జునను.. ఇరానీ ఛాయ్‌, కరాచీ బిస్కెట్‌, హైదరాబాద్ బిర్యానీ... (Video)

తల్లి లేని ప్రపంచమే లేదు అందుకే కథను నమ్మి తల్లి మనసు తీశా: ముత్యాల సుబ్బయ్య

ఎన్నో అవార్డులు, రివార్డులతో సాయి కుమార్ 50 ఏళ్ల ప్రస్థానం

మహేష్‌బాబు విడుదల చేసిన సుకృతి వేణి గాంధీ తాత చెట్టు ట్రైలర్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తులసి, అల్లం, అతిమధురం.. ప్రాణాపాయం.. గోరువెచ్చని ఉప్పు నీటితో..?

ఆముదం నూనెతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రూట్ కేక్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

తర్వాతి కథనం
Show comments