Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయవాడ టు పులివెందుల.. మరో కార్యాలయం తరలింపు?!

Webdunia
శుక్రవారం, 12 మార్చి 2021 (20:15 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గుట్టుచప్పుడు కాకుండా ప్రభుత్వ కార్యాలయాలను తరలిస్తోంది. ఇప్పటికే వైజాగ్‌కు కొన్ని కార్యాలయాలను తరలించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇపుడు విజయవాడ నుంచి పులివెందులకు వెటర్నరీ, బయోలాజికల్‌ అండ్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ను తరలించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 
 
పశుసంవర్ధకశాఖ డైరెక్టర్‌ విజ్ఞప్తి మేరకు కంకిపాడులోని వీబీఆర్‌ఐని కడప జిల్లాకు తరలించాలని ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది. పులివెందులలో 30 వేల చదరపు గజాల్లో నిర్మాణాలు చేపట్టాలని నిర్ణయించారు. ఉద్యోగులకు పులివెందులలో క్వార్టర్స్‌ ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. 
 
ఇటీవల విజయవాడలో కమాండ్ కంట్రోల్ రూంను ఏర్పాటు నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. కంట్రోల్ రూంను విజయవాడ నుంచి విశాఖ తరలించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. విజయవాడలో కంట్రోల్ రూం ఏర్పాటుకు కేటాయించిన రూ.13.8 కోట్లను విశాఖకు బదలాయిస్తున్న ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. 
 
రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉండాల్సిన కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రాన్ని 400 కిలో మీటర్ల దూరంలో ఏర్పాటు చేయడమంటే రాజధానిని విశాఖకు మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యల్లో ఇదొక కీలక ఘట్టంగా స్పష్టమవుతోంది. 
 
రాష్ట్రంలో ఎక్కడ ఏది జరిగినా అక్కడి సీసీ కెమెరాలు లేదా డ్రోన్ల ద్వారా వీడియో ఫుటేజ్‌ తీసుకుని కమాండ్‌ కంట్రోల్‌ నుంచి ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తారు. అలాంటి కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను అధికారులు ఉండే ప్రాంతంలో కాకుండా మరోచోట ఏ ప్రభుత్వమూ ఏర్పాటు చేయదు. అందుకు పోలీసు శాఖ కూడా సమ్మతి తెలపదు. 
 
గత ప్రభుత్వంలో ఈ సెంటర్‌ ఏర్పాటుకు విజయవాడలో స్థలం ఎంపిక చేసి రూ.13.80 కోట్లు నిధులు మంజూరు చేసింది. ప్రభుత్వం మారడంతో నిధుల విడుదలలో జాప్యం జరగడంతో ప్రదిపాదన అలా ఆగిపోయింది. తాజాగా జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వం విశాఖకు పరిపాలన రాజధానిని మార్చే ఆలోచనలో భాగంగా అంతే మొత్తంతో అక్కడ సెంటర్‌ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని డీజీపీకి ఆదేశాలు జారీ చేసింది. 
 
మొత్తంమీద పాలనా వికేంద్రీకరణ చర్యల్లో భాగంగా, మూడు రాజధానుల ఏర్పాటు కోసం ప్రభుత్వం అనేక ప్రభుత్వ కార్యాలయాలను గుట్టుచప్పుడు కాకుండా తరలిస్తోంది. ఇందులోభాగంగానే తాజాగా మరో కార్యాలయాన్ని సీఎం జగన్ సొంత నియోజకవర్గమైన పులివెందులకు తరలించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో విశాల్‌తో అభినయ ప్రేమలో వుందా? అసలు విషయం ఏంటో తెలుసా?

సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ మూడో షెడ్యూల్ పూర్తి

బాలీవుడ్‌కు మరో ఆప్షన్ లేదు... దక్షిణాది నటీనటులు అవసరం కావాలి : రెజీనా

డాకు మహారాజ్ ఫ్లాప్ - నిర్మాత నాగ వంశీ పై ట్రోలింగ్

ఇంట్లో నా పరువు కాపాడండి చైతన్య అక్కినేని వేడుకోలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జలుబు, దగ్గుకి అల్లంతో పెరటి వైద్యం

టీలు, కాఫీలకు బదులు ఈ జావ తాగరాదూ?

86 ఏళ్ల వృద్ధుడిలో మింగే రుగ్మతను విజయవంతంగా పరిష్కరించిన విజయవాడ మణిపాల్ హాస్పిటల్

శీతాకాలం సీజనల్ వ్యాధులను అడ్డుకునే ఆహారం ఏమిటి?

బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ పర్యటన: తాజా ఫ్యాషన్ ప్రపంచంలోకి ద వన్ అండ్ వోన్లీ

తర్వాతి కథనం
Show comments