ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్రాంతి సెలవుల్లో మార్పులు..

Webdunia
మంగళవారం, 11 జనవరి 2022 (18:31 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సంక్రాంతి సెలవుల్లో మార్పులు చేసింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం మంగళవారం ఆదేశాలు జారీచేసింది. గతంలో ఈ నెల 14, 15, 16 తేదీలను సంక్రాంతి సెలవులుగా ప్రభుత్వం ప్రకటించింది. 
 
అయితే, తాజాగా ఈ నెల 13వ తేదీ గురువారం, 14వ తేదీ శుక్రవారం, 15వ తేదీ శనివారాలను భోగి, సంక్రాంతి, కనుమ పండుగలుగా పేర్కొంటూ ప్రభుత్వ ఉద్యోగులకు సెలవులు ఇస్తున్నట్టు ప్రకటించింది. 
 
కాగా, కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నెల 18వ తేదీ నుంచి నెలాఖరు వరకు రాష్ట్రంలో రాత్రిపూట కర్ఫ్యూను కూడా అమలు చేయనున్న విషయం తెల్సిందే. ఈ సమయంలో అత్యవసర సర్వీసులను మాత్రమే అనుమతిస్తారు. 
 
ఏపీలో రాత్రిపూట కర్ఫ్యూ 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ వైరస్ వ్యాప్తి కట్టడి కోసం ప్రభుత్వం అనేక కఠిన ఆంక్షలు విధిస్తుంది. ఇందులోభాగంగా, ఈ నెల 31వ తేదీ వరకు రాత్రిపూట కర్ఫ్యూ విధిస్తూ ఆదేశాలు జారీచేసింది. అలాగే, థియేటర్లలో 50 శాతం ఆక్యుపెన్సీతో సినిమాల ప్రదర్శనకు మాత్రమే అనుమతి ఇచ్చింది. అంటే ఒక సీటు విడిచి మరో సీటులో కూర్చొని సినిమా తిలకించేలా షరతులు విధించింది. 
 
ప్రస్తుతం రాష్ట్రంలో కరోనాతో పాటు.. ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. దీంతో ఈ నెల 31వ తేదీ వరకు కర్ఫ్యూ విధిస్తూ నిర్ణయం తీసుకుంది. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూను అమలు చేయనున్నట్టు ప్రకటించింది. 
 
అయితే, రాత్రిపూట కర్ఫ్యూ నుంమచి ఆస్పత్రులు, ఫార్మసీ దుకాళాలు, ప్రసార మాధ్యమాలు, టెలీ కమ్యూనికేషన్, ఐటీ సేవలు, విద్యుత్ సేవలు, పెట్రోల్ బంకులు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, వైద్యులు, వైద్య సిబ్బంది, విమానాశ్రయాలకు వెళ్లే ప్రయాణికులకు మినహాయింపు ఉంటుందని పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రేమ లేదని చెబుతున్న లక్ష్మణ్ టేకుముడి, రాధికా జోషి

Director Vasishta, : జంతువుల ఆత్మతోనూ కథ తో నెపోలియన్ రిటర్న్స్

Vishnu: విష్ణు విశాల్... ఆర్యన్ నుంచి లవ్లీ మెలోడీ పరిచయమే సాంగ్

Gopichand: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి సినిమా భారీ ఇంటర్వెల్ యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్

నారా రోహిత్, శిరీష ప్రీ - వెడ్డింగ్ వేడుకలు ప్రారంభం.. పెళ్లి ముహూర్తం ఎప్పుడంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments