Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ నెల 5న తిరుపతికి వస్తున్న సీఎం జగన్

Webdunia
సోమవారం, 2 మే 2022 (09:16 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం తిరుపతిలో పర్యటించి పలు ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. సీఎం వైఎస్‌ జగన్‌ పర్యటన ఏర్పాట్లను టీటీడీ అధికారులు పరిశీలించారు. అలిపిరిలో రూ.240 కోట్లతో శ్రీ పద్మావతి పిల్లల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి సీఎం వైఎస్ జగన్ శంకుస్థాపన చేసేందుకు వస్తున్నారు. 
 
అలాగే, తిరుమలకు పునరుద్ధరించిన శ్రీవారి మెట్టు కాలిబాటను కూడా సీఎం జగన్‌ ప్రారంభించనున్నారు. ఆయన రెండు వార్డులను వర్చువల్‌గా ప్రారంభిస్తారు. సీఎం తిరుపతి పర్యటన సందర్భంగా వైకాపా శ్రేణులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా కలెక్టర్, ఇతర అధికారులు ఈ ఏర్పాట్లలో నిమగ్నమైవున్నారు. 


జగన్ తిరుపతి వస్తున్నారు.. మీ కార్లు జాగ్రత్త అంటూ దండోరా వేసిన జనసేన 
 
ఏపీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాష్ట్ర పరువు గంగలో కలిసిపోతుంది. జగన్ రెడ్డి వైఖరికి తోటు అధికారుల అత్యుత్సాహం, అతి చేష్టలు రాష్ట్రం పరువును మరింతగా దిగజార్చుతున్నాయి. ఇటీవల సీఎం జగన్ ఒంగోలు జిల్లా పర్యటన సందర్భంగా సీఎం కాన్వాయ్ కోసం తిరుమల వెళుతున్న భక్తుల కారును ఆపి ఆర్టీవో అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పైగా, భక్తులు బస్సులో వెళ్లాలంటూ ఉచిత సలహా కూడా ఇచ్చారు. సీఎం కాన్వాయ్ కోసం ఆర్టీవో అధికారులు ట్రావెల్ కారును స్వాధీనం చేసుకున్నవార్త జాతీయ మీడియాలో వైరల్ అయింది. 
 
ఇదిలావుంటే, ఈ నెలలో సీఎం జగన్ తిరుపతి పర్యటనకు రానున్నారు. దీంతో జనసేన పార్టీ తిరుపతి విభాగం నేతలు వినూత్న ప్రచారానికి శ్రీకారం చుట్టారు. సీఎం జగన్ తిరుపతి వస్తున్నారని, స్థానిక ప్రజలు, తిరుమలకు వచ్చే యాత్రికులు కార్లు జాగ్రత్తగా ఉంచుకోవాలని హెచ్చరిస్తూ దండోరా వేశారు. 
 
జనసేన పార్టీ తిరుపతి ఇన్చార్జి కిరణ్ రాయల్ నేతృత్వంలో ఈ దండోరా కార్యక్రమం నిర్వహించారు. ఇందులో జనసేన నేతలు, కార్యకర్తలు పాల్గొని, తిరుపతిలో చాటింపు వేశారు. సీఎం జగన్ మే 5న తిరుపతిలో పర్యటించనున్నారు. తిరుపతిలో టీటీడీ నిర్మిస్తున్న చిన్న పిల్లల మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రికి శంకుస్థాపన చేయనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rukshar Dhillon: హాపీ ఉమన్స్ డే గా నటి రుక్సార్ ధిల్లాన్ ఘాటు విమర్శలు

దర్శకులు మెచ్చుకున్న 14 డేస్ గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో చిత్రం.. ఫుల్ ఫన్ రైడ్

సమాజంలో మార్పుకే కీప్ ది ఫైర్ అలైవ్ ఫిల్మ్ తీసాం : చిత్ర యూనిట్

ఊచకోత, బస్సు దహనం, సామూహిక హత్యల నేపధ్యంలో 23 చిత్రం

మేం అందరి కంటే ధనికులం - కళ్యాణ్ సైలెంట్‌ నిరసన : మెగా అంజనమ్మ ముచ్చట్లు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లో అకింత్ వెల్‌నెస్ సెంటర్ 'అంకితం' ప్రారంభం

సన్ ఫ్లవర్ ఆయిల్ మంచిదా చెడ్డదా?

పులి త్రేన్పులు వస్తున్నాయా? జీలకర్ర నీరు తాగి చూడండి

ప్రతిరోజూ పసుపు, జీలకర్ర నీటిని తీసుకుంటే..? మహిళల్లో ఆ సమస్యలు మాయం

నడుస్తున్నప్పుడు ఇలాంటి సమస్యలుంటే మధుమేహం కావచ్చు

తర్వాతి కథనం
Show comments