Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఏపీలో దిగజారిపోయిన శాంతిభద్రతలు : నాదెండ్ల మనోహర్

Advertiesment
nadendla manohar
, ఆదివారం, 1 మే 2022 (15:52 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా దిగజారిపోయాయని, దీనికి నిదర్శనమే రేపల్లె రైల్వే స్టేషనులో మహిళపై సామూహిక అత్యాచార ఘటన అని జనసేన పార్టీ సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. ఉమ్మడి గుంటూరు జిల్లా రేపల్లె రైల్వే స్టేషన్‌లో ఓ వలస కూలీ మహిళపై ముగ్గురు కామాంధులు అత్యాచారానికి పాల్పడ్డారు. దీనిపై ఆయన స్పందించారు. 
 
గత పది రోజులుగా రాష్ట్రంలో వరుసగా ఇలాంటి సంఘటనలు చోటుచేసుకుంటున్నాయన్నారు. రానీ, సీబీఐ దత్తపుత్రుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం జగన్ ఏమాత్రం స్పందించడం లేదని, తాడేపల్లి ప్యాలెస్‌లో హాయిగా సేదతీరుతున్నారని మండిపడ్డారు. పైగా, బాధిత కుటుంబాలపైనే నిందలు వేసి తప్పించుకోవాలని ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఆయన ఆరోపించారు. 
 
హోంశాఖను, పోలీసులను ఈ ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసిందన్నారు. ఫలితంగా రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. చిత్తశుద్ధి లేకుండా చట్టాలు చేసి ప్రచారం చేసుకోవడం వల్ల ఏ ఒక్క ఆడబిడ్డకు భరోసా లభించదన్నారు. తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటకు కదలని సీఎం ఓసారి వచ్చి బాధిత కుటుంబాలతో మాట్లాడితే పరిస్థితి ఏంటో అర్థమవుతుందన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రేపల్లె రైల్వే స్టేషన్ అత్యాచార బాధితురాలికి న్యాయం చేస్తాం : మంత్రి విడదల రజినీ