Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాటి భస్మాసురుడు, నరకాసురుడు, మహిషాసురులే నేటి జగనాసురుడు!

Webdunia
సోమవారం, 27 డిశెంబరు 2021 (10:25 IST)
విజయవాడలో బీజేపీ ఆధ్వర్యంలో జరిగే జనాగ్రహ బహిరంగసభ తొలి అడుగుతో, జగన్ పాలన పతనానికి నాంది ప‌లుకుతుంద‌ని ఏపీ బీజేపీ నాయ‌కులు చెప్పారు. పూర్వం భస్మాసురుడు, నరకాసురుడు, మహిషాసురుడు, రావణాసురులే,  నేటి యుగంలో జగనాసురుడు అవతారం అని అభివ‌ర్ణించారు.
 
 
చేతగాని అసమర్థ పాలనతో  వ్యవస్థలన్నీ నిర్వీర్యం భస్మాసురుడులాగే జగనాసురుడు భస్మం కావడం తద్యం అన్నారు. 75ఏళ్ల స్వతంత్ర దేశంలో ఇంతటి దుర్మార్గ అరాచక అక్రమాలతో జగన్ కక్ష సాధింపు పాలన ఎవరూ చూడలేద‌న్నారు. విజయవాడలో బీజేపీ ఆధ్వర్యంలో జరిగే జనాగ్రహ బహిరంగసభ ఏపీలో పాల‌న‌కు చ‌రమాంకం పాడుతుంద‌ని చెప్పారు. 

 
బీజేపీ మూడు రోజుల శిక్షణ సమావేశాల్లో రాష్ట్ర అధికార ప్రతినిధిలు భానుప్రకాష్ రెడ్డి, సామంచి శ్రీనివాస్ ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో జ‌గ‌న్ పాల‌న‌పై ధ్వ‌జమెత్తారు. ఒక్క అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని మార్చేస్తా అని, రాష్ట్రాన్ని అప్పుల ప్రదేశ్, అంధకార ప్రదేశ్ గా మార్చి సర్వనాశనం చేసిన తుగ్లక్ రెడ్డి జ‌గ‌న్ అని ఆరోపించారు. దివాలా తీసిన ఖజానాను నింపుకోవడానికి ఎపుడో కట్టిన ఇళ్లకు ఓటీఎస్ పేరుతో బలవంత వసూళ్లతో పేదలను దోపిడీ చేస్తున్నార‌ని విమ‌ర్శించారు.


బిజేపీ జిల్లా అధ్యక్షుడు సన్నారెడ్డి దయాకర్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి కండ్రిగ ఉమ, జాతీయ కార్యవర్గ మాజీ సభ్యులు శాంతారెడ్డి, ఎస్సీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి ముని సుబ్రమణ్యం, మండల అధ్యక్షుడు పురుషోత్తం, ప్రధాన కార్యదర్శి ఆనంద్, సీనియర్ నాయకులు సుబ్బ రత్నమ్మ, భాస్కర్ రెడ్డి, సిద్దులయ్య, మోర్చా నాయకులు ఏసు (నారాయణ), సత్యవేడు నాగలాపురం పిచాటుర్, కండ్రిగ, కేవీబీ పురం, నారాయణ వనం మండలాల అధ్యక్షులు, నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

M4M చూసి కిల్ల‌ర్ ఎవ‌రో గెస్ చేస్తే లక్ష రూపాయలు బహుమతి : డైరెక్ట‌ర్ మోహన్ వడ్లపట్ల

రామ్ చ‌ర‌ణ్, జాన్వీ క‌పూర్‌, బుచ్చిబాబు సానా చిత్రంలో మున్నాభాయ్ దివ్వేందు

తెలుగులో పా.. పా..గా రాబోతున్న త‌మిళ బ్లాక్ బ‌స్ట‌ర్ డా..డా

వైవిఎస్ చౌదరి సినిమాలో వీణారావు ఫస్ట్ దర్శన్ లాంచ్ చేసిన సుప్రియ, స్వప్నాదత్

ఆడ పిల్లలు ఎదిగేందుకు తోడ్పాడు అందించాలి : నారి గ్లింప్స్ రిలీజ్ చేసిన మంత్రి సీతక్క

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments