Webdunia - Bharat's app for daily news and videos

Install App

అంత‌ర్వేది నూతన ర‌థం సిద్దం: దేవ‌దాయ శాఖ మంత్రి వెలంప‌ల్లి శ్రీ‌నివాస‌రావు

Webdunia
సోమవారం, 18 జనవరి 2021 (20:27 IST)
ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు భక్తుల మనోభావాలకు అనుగుణంగా భక్తులను భక్తులను తరింప చేసే తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణానికి ముందే నూతన రథాన్ని సిద్దం చేయడం జరిగిందని మంత్రి వెలంప‌ల్లి తెలిపారు. 
 
సొమ‌వారం బ్రాహ్మాణ‌వీధిలో మంత్రి క్యాంపు కార్యాల‌యంలో మంత్రి  వెలంప‌ల్లి శ్రీ‌నివాస రావును దేవ‌దాయ శాఖ డిప్యూటి క‌మిష‌న‌ర్ విజ‌య‌రాజు, ఏసీ భద్రాజీ, ఆల‌య ప్ర‌ధాన అర్చ‌కులు శ్రీ‌నివాస కిర‌ణ్‌, స్థానచార్యులు ‌రంగ‌చార్యులు, ర‌మేష్ త‌దిత‌రులు క‌లిసి మంత్రిని అంత‌ర్వేది ర‌థం సంప్రోక్ష‌ణ‌కు రావల‌సిందిగా ఆహ్వ‌నించారు. 
 
ఫిబ్రవరి నెలలో మూడు రోజుల పాటు నూత‌న ర‌థానికి వైఖాసన ఆగమ సాంప్రదాయం ప్ర‌కారం  సంప్రోక్ష‌ణ నిర్వ‌హిస్తున్న‌ట్లు తెలిపారు. ఫిబ్రవరి 11న సంకల్పం, 12న ఆదివాసం, 13న అభిషేకం, పూర్ణ‌హుతి,ర‌థ‌ ప్ర‌తిష్ట జ‌రుగుతుంద‌న్నారు.  22వ తేదీ  శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణం అనంత‌రం 23న కల్యాణోత్సవ రథం ఊరేగింపు క‌నుల పండుగగా జ‌రుగుతుంద‌న్నారు.
 
 
3 కోట్లు రూపాయ‌ల‌తో రామతీర్థం పునః నిర్మాణం
రామతీర్థం విజయనగరం జిల్లా లోని శ్రీ రామచంద్రస్వామి దేవాలయ అభివృద్ది,పునః నిర్మాణానికి మూడు కోట్లు రూపాయులు కేటాయించినట్లు మంత్రి వెలంప‌ల్లి శ్రీ‌నివాస‌రావు పేర్కొన్నారు. 
 
సొమ‌వారం బ్రాహ్మాణ‌వీధిలో మంత్రి క్యాంపు కార్యాల‌యంలో మంత్రి  వెలంప‌ల్లి శ్రీ‌నివాస రావు అధ్య‌క్ష‌త‌న‌ సెక్ర‌ట‌రీ గిరిజా శంక‌ర్‌, ప్ర‌త్యేక క‌మిష‌న‌ర్ పి.అర్జున‌రావు,ఎస్.ఈ ఎ శ్రీ‌నివాస్‌,రీజ‌న‌ల్ జాయింట్ క‌మిష‌న‌ర్ భ్ర‌మ‌రాంబ‌, డిఈలతో స‌మీక్ష స‌మావేశం నిర్వ‌హించారు.

పండితులు స‌ల‌హాలు,వైఖాసన ఆగమ సంప్రదాయం ప్ర‌కారం ఆల‌య అభివృద్ది, పునః నిర్మాణం చేపడుతున్నట్లు వివ‌రించారు.విజ‌య‌న‌గ‌రం జిల్లా రామ‌తీర్థం పునః నిర్మాణ ప‌నులు ఏడాదిలో పూర్తి చేయాల‌ని అధికారుల‌ను అదేశించారు..700 అడుగు ఎత్తులో ఉన్న ఆల‌య నిర్మాణం  పూర్తి రాతి క‌ట్ట‌డాల‌తో జ‌రుతుంద‌న్నారు.కోదండ రాముడి విగ్ర‌హాన్ని తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్తానం వారు త‌యారు చేసి అంద‌జేయున్న‌ట్లు తెలిపారు.

అదేవిధంగా  రామ‌తీర్థం మొట్లు మార్గం స‌రిచేయ‌డం పాటుగా కొత్త‌ మొట్లు నిర్మాణం చేప‌ట్ట‌డం జ‌రుగుతుంద‌న్నారు. దేవాల‌య ప‌రిస‌రాల ప్రాంతం మొత్తం విద్యుత్ దీపాలంక‌ర‌ణ చేయ‌డం,  శా‌శ్వత నీటి వ‌స‌తి,కోనేటిని శుబ్ర‌ప‌ర్చ‌టం, అనంత‌రం కోనేటి చుట్టూ గ్రిల్స్ ఏర్నాటు చేయ‌టం,ప్రాక‌ర నిర్మాణం, హోమ‌శాల‌,నివేద‌న శాల నిర్మాణం కూడా పూర్తి చేయ‌డం జ‌రుగుతుంద‌న్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బరోజ్ 3డీ లాంటి సినిమా నలభై ఏళ్ళుగా రాలేదు : మోహన్ లాల్

రామ్ వల్లే మాస్టర్ అయ్యా - అల్లు అర్జున్, సుకుమార్ వల్లే పుష్ప2 చేశా : విజయ్ పోలాకి మాస్టర్

Pushpa 2 OTT: పుష్ప 2 ది రూల్ ఓటీటీలోకి ఎప్పుడొస్తుంది..?

నోయల్ బాణీతో రాహుల్ సిప్లిగంజ్ పాట తెలుగోడి బీట్ట్ సాంగ్

తమన్నా భాటియా ఓదెల 2 నుంచి తమన్నా టెర్రిఫిక్ లుక్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

పొడియాట్రిక్ పాదాలు-చీలమండ చికిత్సను మెరుగుపరచడానికి ఇసావోట్ అత్యాధునిక ఓ-స్కాన్ ఎంఆర్ఐ మెషీన్‌

చేదుగా వుండే కాకరకాయ ఆరోగ్యానికి అద్భుతమైన మేలు

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

తర్వాతి కథనం
Show comments