Webdunia - Bharat's app for daily news and videos

Install App

జ‌న‌వ‌రి 20న రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల

Webdunia
సోమవారం, 18 జనవరి 2021 (20:23 IST)
భక్తుల సౌకర్యార్థం ఫిబ్ర‌వ‌రి నెల‌కు సంబంధించిన‌ రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను జ‌న‌వ‌రి 20న బుధ‌‌వారం ఉద‌యం 9 గంట‌ల‌కు టిటిడి ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది. అదేవిధంగా, అదేరోజు మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు ఫిబ్ర‌వ‌రి నెల‌కు సంబంధించి తిరుమ‌ల‌, తిరుప‌తిలోని గ‌దుల బుకింగ్ కోటాను విడుద‌ల చేస్తారు. 
 
భక్తులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఆన్‌లైన్‌లో ముందస్తుగా ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను, గ‌దుల‌ను బుక్‌ చేసుకోవాలని కోర‌డ‌మైన‌ది.
 
ఎస్వీ మ్యూజియం అభివృద్ధిపై ఈవో స‌మీక్ష‌
తిరుమ‌ల‌లోని ఎస్వీ మ్యూజియం అభివృద్ధిపై టిటిడి ఈవో డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి సోమ‌వారం తిరుప‌తిలోని ప‌రిపాల‌నా భ‌వ‌నంలో గ‌ల కార్యాల‌యంలో స‌మీక్ష స‌మావేశం నిర్వ‌హించారు. 
 
ఈ సంద‌ర్భంగా టాటా, టెక్ మ‌హింద్రా సంస్థ‌లు సంయుక్తంగా మ్యూజియం అభివృద్ధి ప్ర‌ణాళిక‌ల‌పై ప‌వ‌ర్‌పాయింట్ ప్ర‌జంటేష‌న్ ఇచ్చారు. మ్యూజియంలోని గ్రౌండ్‌, మొద‌టి అంత‌స్తు, రెండో అంత‌స్తుల‌ను 6 జోన్లుగా విభ‌జించి గ్యాల‌రీలు ఏర్పాటు చేయాల‌ని ఈవో సూచించారు.

భ‌క్తులు లోనికి ప్ర‌వేశించ‌గానే స్వామివారి దివ్య‌వైభ‌వాన్ని వీక్షించి త‌రించేలా, ఆధ్యాత్మిక అనుభూతి పొందేలా ఏర్పాట్లు చేయాల‌ని కోరారు. శ్రీ‌వారి ఆల‌యం, వాహ‌నాలు, సేవ‌లు, స‌ప్త‌గిరుల‌కు సంబంధించి వ‌ర్చువ‌ల్ అనుభ‌వం పొందేలా ఉండాల‌న్నారు. మ్యూజియం లోప‌ల ఇంటీరియ‌ర్‌, వెలుప‌ల ప‌చ్చ‌ద‌నం పెంపుపై ప్ర‌త్యేక దృష్టి సారించాల‌ని ఈవో కోరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Saiyami Kher: కాస్టింగ్ కౌచ్ : టాలీవుడ్‌లో నన్ను ఆ ఏజెంట్ కలిసింది.. అడ్జెస్ట్ చేసుకోవాలని..?

బంగారం స్మగ్లింగ్ కేసు : రన్యారావుకు బెయిల్ అయినా జైల్లోనే...

నేను, నా భర్త విడిపోవడానికి మూడో వ్యక్తే కారణం : ఆర్తి రవి

మంచు మనోజ్ బర్త్ డే సందర్భంగా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌ రక్షక్ అనౌన్స్ మెంట్

ముంబయి గుహల్లో హీరో తేజ సజ్జా మూవీ మిరాయ్ కొత్త షెడ్యూల్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

తర్వాతి కథనం
Show comments