Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫిబ్ర‌వ‌రి 19న తిరుమ‌ల‌లో రథసప్తమి... ద‌ర్శ‌న టోకెన్లు గ‌ల భ‌క్తుల‌కు మాత్ర‌మే అనుమ‌తి

Webdunia
సోమవారం, 18 జనవరి 2021 (20:18 IST)
సూర్య జయంతి సందర్భంగా ఫిబ్రవరి 19న తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో రథసప్తమి పర్వదినం నిర్వ‌హిస్తామని, ఇందుకోసం ద‌ర్శ‌న టోకెన్లు గ‌ల భక్తుల‌ను మాత్ర‌మే తిరుమ‌లకు అనుమ‌తిస్తామ‌ని టిటిడి ఈవో డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి తెలిపారు.

తిరుప‌తిలోని టిటిడి ప‌రిపాల‌నా భ‌వ‌నంలో సోమ‌వారం సాయంత్రం జిల్లా క‌లెక్ట‌ర్ శ్రీ నారాయ‌ణ భ‌ర‌త్ గుప్తా, అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి, సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టితో క‌లిసి ఈవో ర‌థ‌స‌ప్త‌మి ప‌ర్వ‌దినం ఏర్పాట్ల‌పై ప్రాథ‌మిక స‌మావేశం నిర్వ‌హించారు.
 
ఈ సంద‌ర్భంగా ఈవో మాట్లాడుతూ ర‌థ‌స‌ప్త‌మి ప‌ర్వ‌దినం నాడు శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామివారు ఏడు ప్ర‌ధాన వాహ‌నాల‌పై ఆల‌య మాడ వీధుల్లో భ‌క్తుల‌కు ద‌ర్శ‌న‌మిస్తార‌ని, సూర్య‌ప్ర‌భ వాహ‌నంతో మొద‌లై రాత్రి చంద్ర‌ప్ర‌భ వాహ‌నంతో వాహ‌న‌సేవ‌లు ముగుస్తాయ‌ని తెలిపారు. చ‌క్ర‌స్నానం ఏకాంతంగా జ‌రుగుతుంద‌న్నారు.

అనంత‌రం భ‌క్తుల‌ను ఏవిధంగా గ్యాల‌రీల్లోకి అనుమ‌తించాలి, భ‌ద్ర‌తప‌రంగా తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లపై అధికారుల‌తో చ‌ర్చించారు. జిల్లా యంత్రాంగం స‌మ‌న్వ‌యంతో భ‌క్తుల‌కు త‌గిన ఏర్పాట్లు చేయాల‌ని, అన్ని విభాగాల అధిప‌తులు ఈ ప‌ర్వ‌దినానికి స‌మాయ‌త్తం కావాల‌ని సూచించారు.
 
అనంత‌రం తిరుమ‌ల‌లోని అన్న‌మ‌య్య భ‌వ‌నంలో ర‌థ‌స‌ప్త‌మి ఏర్పాట్ల‌పై వివిధ విభాగాధిప‌తుల‌తో టిటిడి అద‌న‌పు ఈవో ఎవి.ధ‌ర్మారెడ్డి స‌మీక్ష నిర్వ‌హించారు. విభాగాల వారీగా స‌మీక్షించి అధికారుల‌కు ప‌లు సూచ‌న‌లు చేశారు.
 
ఈ స‌మావేశాల్లో ఏఎస్పీ మునిరామ‌య్య‌, చీఫ్ ఇంజినీర్ ర‌మేష్‌రెడ్డి, అద‌న‌పు సివిఎస్వో శివ‌కుమార్‌రెడ్డి, శ్రీ‌వారి ఆల‌య డెప్యూటీ ఈవో హ‌రీంద్ర‌నాథ్ అన్ని విభాగాల అధిప‌తులు పాల్గొన్నారు.
 
రథసప్తమి నాడు వాహనసేవల వివరాలు : 
 
సూర్యప్రభ వాహనం       ఉదయం      5.30 గం||ల నుంచి 8.00 గం||ల వరకు(సూర్యోద‌యం ఉద‌యం 6.38 గంట‌ల‌కు)
 
చిన్నశేష వాహనం          ఉదయం         9.00 గం||ల నుంచి 10.00 గం||ల వరకు
 
గరుడ వాహనం              ఉదయం         11.00 గం||ల నుంచి 12.00 గం||ల వరకు
 
హనుమంత వాహనం     మధ్యాహ్నం   1.00 గం||ల నుంచి 2.00 గం||ల వరకు
 
చక్రస్నానం                   మధ్యాహ్నం     2.00 గం||ల నుంచి 3.00 గం||ల వరకు
 
కల్పవృక్ష వాహనం         సాయంత్రం   4.00 గం||ల నుంచి 5.00 గం||ల వరకు
 
సర్వభూపాల వాహనం    సాయంత్రం   6.00 గం||ల నుంచి 7.00 గం||ల వరకు
 
చంద్రప్రభ వాహనం        రాత్రి                 8.00 గం||ల నుంచి 9.00 గం||ల వరకు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిచ్చా సుదీప్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ మ్యాక్స్ సిద్దమైంది

ద‌ళ‌ప‌తి విజ‌య్ త‌న‌యుడు జాస‌న్ సంజ‌య్ ద‌ర్శ‌క‌త్వంలో సందీప్ కిష‌న్ హీరో

రానా హాజరయ్యే గ్యాదరింగ్స్ లో శ్రీలీల తప్పనిసరి ఎందుకోతెలుసా

పుష్ప సాధారణ సినిమానే, కానీ ప్రేక్షకల ఆదరణతో గ్రాండ్ గా పుష్ప-2 చేశాం : అల్లు అర్జున్‌

వరుస ఫ్లాప్‌లు... అయినా ఛాన్సులు.. 'డ్యాన్సింగ్ క్వీన్‌' సీక్రెట్ ఏంటోమరి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments