Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

దుర్యోధనుడి మాట విని చీరలాగిన దుశ్శాసనుడిలా మంత్రుల మాటలు: అశోక్ బాబు

దుర్యోధనుడి మాట విని చీరలాగిన దుశ్శాసనుడిలా మంత్రుల మాటలు: అశోక్ బాబు
, బుధవారం, 13 జనవరి 2021 (15:55 IST)
పల్లెల్లో ఉండే రైతులు, రైతుకూలీలు, చేతివృత్తులపనివారు జగన్ ప్రభుత్వంపై తీవ్రఆగ్రహంతో ఉన్నారని, గొడ్డొచ్చినవేళ, కోడలొచ్చన వేళ అన్నట్లుగా జగన్ అడుగుపెట్టిన వేళావిశేష ప్రభావంతో రైతుల కు ఈఏడాది సంక్రాంతి పండుగసంతోషం లేకుండా పోయిందని,  టీడీపీ కేంద్ర కార్యాలయ కార్యదర్శి, ఎమ్మెల్సీ అశోక్ బాబు తెలిపారు.

బుధవారం ఆయన మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. జగన్ జమానాలో రైతులు కష్టపడి పండించిన ఉత్పత్తులు చేతిదాకావచ్చి, నోటికి అందకుండా పోయాయని, అరకొరగా పండినాకూడా సరైన గిట్టుబాటుధరలేకపోవడంతో అన్నదాతల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందన్నారు.

రైతుల పరిస్థితి సరిగాలేకపోవడంతో, వారినే నమ్ముకొని బతికే రైతుకూలీలు, పల్లెల్లో ఉండే కుల, చేతివృత్తులవారికి కూడా సరైన ఉపాధి లేకుండా పోయిందన్నారు. ప్రభుత్వం రైతులకు అన్యాయంచేసి, వారిని నమ్ముకొని జీవించేవారిని నట్టేటముంచబట్టే, వారి ముందు కు వెళ్లడానికి పాలకులు భయపడుతున్నారన్నారు. 

పంచాయతీ ఎన్నిలకు ప్రభుత్వం వెనుకాడటానికి ఇదే ప్రధాన కారణమని టీడీపీనేత స్పష్టంచేశారు. ప్రభుత్వాన్ని కాదని ఎన్నికల కమిషనర్ ఏం పీకుతాడన్న మంత్రి , ఆయన ప్రభుత్వం, నేడు ఎన్నికలు వద్దంటూ కోర్టుకు ఎందుకువెళ్లారో చెప్పాలన్నారు. పారాసెట్మాల్ , బ్లీచింగ్ పౌడర్ తో తగ్గిపోయే కరోనాకు వ్యాక్సిన్ తో పనేమిటో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని అశోక్ బాబు డిమాండ్ చేశారు.

కరోనా వైరస్ పెద్ద ప్రాణాంతకంకాదు, అది సాధారణ జ్వరం లాంటిదే అన్నవ్యక్తి, ఇప్పటికీ ఆజ్వరాన్నే సాకుగాచూపి, ఎన్నికల కు వెళ్లడానికి భయపడుతున్నాడన్నారు. కరోనా ఉధృతంగా ఉన్న సమయంలో అది ప్రాణాంతకం కాదన్న వ్యక్తికి, నేడు ఎన్నికలకు వచ్చేసరికి అది సామాన్యుల ప్రాణాలను హరించే పెద్దవైరస్ గా ముఖ్యమంత్రికి కనిపించడం సిగ్గుచేటన్నారు.

వైరస్ అంతపెద్ద ప్రా ణాంతకమైతే, ముఖ్యమంత్రి పాల్గొన్న నెల్లూరుసభలో, కోవిడ్ నిబంధనలు ఎంతవరకు పాటించారో, ప్రజలకోసం ఏం జాగ్రత్తలు తీసుకున్నారో  ఆయనే చెప్పాలన్నారు. కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానన్న వ్యక్తి, నేడు ఢిల్లీపెద్దల కాళ్లపైపడి, తనకు శిక్షపడకుండా తప్పించుకుతిరుగుతూ, తనను కాపాడుతున్న వారికే జగన్ కోవర్టుగా పనిచేస్తున్నాడన్నారు.

ప్రతిపక్షపార్టీకి ఎలక్ష న్ కమిషనర్ కోవర్టు అయితే, తనబాబాయి హత్యకేసు విచారణ సజావుగా జరిపించకుండా, జగన్ ఎవరికి కోవర్టుగా మారాడో, ఎవరిని రక్షించాలని చూస్తున్నాడో సమాధానం చెప్పాలని అశోక్ బాబు డిమాండ్ చేశారు. రాజకీయ పదవుల్లో ఇప్పుడున్నది వైసీ  పీ యేనని, ఆయనపార్టీవారే టీడీపీకి, ఎన్నికల కమిషనర్ కు కోవర్టులుగా ఉన్నప్పుడు, వారిపైచర్యలు తీసుకోవడానికి ముఖ్యమంత్రి ఎందుకు వెనకాడుతున్నాడన్నారు.   
 
ముఖ్యమంత్రి వ్యాఖ్యలుఅలాఉంటే, తామేమీ ఆయనకు తీసిపోమ న్నట్లుగా మంత్రులు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు. 2018లో స్థానిక ఎన్నికలు టీడీపీ ఎందుకునిర్వహించలేదంటున్న వైసీపీవారు, ఆనాడే కోర్టునుఆశ్రయించి, ఎన్నికలు జరిగేలా ఎందుకు చూడలేదన్నారు.  ఆనాడు కోర్టు ఆదేశాలకు అనుగుణం గానే, అనేకరాష్ట్రాల్లో స్థానికఎన్నికలువాయిదా పడ్డాయన్నారు. 

కోవిడ్ వైరస్, వ్యాక్సిన్ పంపిణీని సాకుగా చూపి, స్థానిక ఎన్నికలు వద్దంటున్న వైసీపీవారు, తిరుపతి ఉపఎన్నిక విషయంలో కూడా అదేవిధంగా వ్యవహరించగలరా అని టీడీపీనేత నిలదీశారు. 

ఇళ్లపట్టాల పంపిణీకార్యక్రమంలో కొబ్బరిచెట్టుకూలి ఇద్దరు చనిపోతే ఈప్రభుత్వం, వారికుటుంబాలకు ఏం న్యాయంచేసిందో చెప్పాలన్నా రు. కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను నిర్వహించేది వైద్య,ఆరోగ్య శాఖ కు చెందినవారని, పంచాయతీ ఎన్నికల నిర్వహణకు వారితో పనేముంటుందో ప్రభుత్వం చెప్పాలన్నారు.

పల్లెల్లో ఎన్నికలు నిర్వహిస్తే, పట్టణాల్లో వ్యాక్సిన్ పంపిణీ చేయడానికి ఉన్నఇబ్బందే మిటన్నారు. వ్యక్తుల మధ్యన ఉండేవివాదంలా, ప్రభుత్వం ఎస్ఈసీ తో విబేధాలను కొనసాగిస్తోందితప్ప, వ్యవస్థలను దృష్టిలో పెట్టుకొని పనిచేయడంలేదన్నారు. కోట్లుఖర్చుపెట్టి, అమరావతికి వ్యతిరేకం గా లాయర్లను నియమించిన ప్రభుత్వం, వారికి ఆసొమ్ముని ఎలా చెల్లించిందో చెప్పాలన్నారు.

ఆర్టికల్ 73, 74 విధులేంటి, రాజ్యాంగ బద్ధంగా సంక్రమించే అధికారాలేంటి, వ్యవస్థలకు ఉండే స్వయం ప్రతిపత్తి ఏమిటో కూడా తెలియకుండా మంత్రులుగా ఉన్నవారు, ఎప్పుడేం మాట్లాడుతున్నారో తెలియకుండా ప్రవర్తిస్తున్నారన్నారు 
నాడు కరోనా ప్రాణాంతంకం కాదన్ని ముఖ్యమంత్రి, నేడు సామా న్యలను చంపేందుకే ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చారని జగన్ అనడం ఆయనలోని అవకాశవాదరాజకీయాలకు పరాకాష్టగా నిలిచిందన్నారు.
\
గతంలో ఎలక్షన్ కమిషన్ నిర్ణయాన్ని తప్పుపడుతూ, ఎన్నికలు ఆపడం రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధమన్న మంత్రి బొత్స, నేడు వ్యాక్సిన్ పంపిణీ అనడం ఏమిటన్నారు.  కరోనా రెండోదశలోకి వెళ్లేలోగానే ఎన్నికలు పెట్టాలని ఆనాడు అడిగిన వైసీపీవారు, నేడు కరోనా కేసులు 200లకులోపు నమోదవుతుంటే ఎన్నికలు వద్దనడం వారిలోని భయాన్ని సూచిస్తోందన్నారు. హైకోర్టుని, సుప్రీంకోర్టుని ఖాతరుచేయకుండా,వ్యవస్థలను ధిక్కరి స్తూ, 151సీట్లున్నాయన్న అహాంకారంతో ముందుకెళితే ఎక్కడ బ్రేక్ పడాలో అక్కడేపడుతుందని అశోక్ బాబు స్పష్టంచేశారు. 

రాజకీయంగా బలంగా ఉన్న కేరళ, రాజస్థాన్ రాష్ట్రాలు ఎన్నికలు పెట్టమని చెప్పినప్పుడు, సుప్రీంకోర్టు గడువుఇచ్చిమరీ ఎన్నికలు జరిగేలా చూసిందన్నారు. అదేపరిస్థితి ఏపీప్రభుత్వానికి కూడా ఎదురవుతుందని టీడీపీఎమ్మెల్సీ జోస్యం చెప్పారు. తనకులం వారినేచుట్టూ ఉంచుకొని, వారికే పదవులన్నీకట్టబెడుతూ, కులాలగురించి ముఖ్యమంత్రి మాట్లాడటం దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉందన్నారు. 

రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తికి కులాన్ని ఆపాదించి, వ్యక్తులపై కులాలపై కక్షపెంచుకొని పాలన సాగిస్తున్న ముఖ్యమంత్రిని ఇప్పుడేచూస్తున్నామన్నారు. 

పంచాయతీ ఎన్నికలు రాష్ట్రంలో జరుగుతాయా లేదా అనేది సుప్రీం కోర్టు నిర్ణయంపైనే ఆధారపడి ఉందన్నారు.  హైకోర్టులో ప్రభుత్వాని కి వ్యతిరేకంగా తీర్పు వస్తే, కచ్చితంగా పాలకులు సుప్రీంను ఆశ్రయి స్తారన్నారు. 

హిందూమతంపై దాడికి సంబంధించి, 340మందిని అరెస్ట్ చేశామంటున్న డీజీపీ,  ఆ జాబితాను ముఖ్యమంత్రికి అందిస్తే మం చిదని టీడీపీ ఎమ్మెల్సీ హితవుపలికారు. దాడులు చేయించేవారే, దేవాలయాలను సందర్శిస్తారని, రథాలు తగలబెట్టినవారే రథయా త్రలు చేస్తారంటున్న ముఖ్యమంత్రి, పరోక్షంగా టీడీపీ, బీజేపీలను దోషులుగా చూపడానికి ప్రయత్నించాడన్నారు. దేవాలయాలపై దాడికిపాల్పడిన వారి పేర్లుకూడా చెప్పలేని ముఖ్యమంత్రి, పిరికి తనం చూసి నవ్వొస్తుందన్నారు.

విజయవాడ దుర్గగుడిలో వెండి సింహాలు మాయమైనా, అంతర్వేదిలో రథం తగలబెట్టినా, కల్లబొల్లి మాటలతోనే ప్రబుత్వం కాలక్షేపం చేసిందన్నారు. తొలిఘటన జరిగి నప్పుడే, ప్రభుత్వం సీరియస్ గా స్పందించిఉంటే, నేడు సిట్ , సీఐడీ విచారణలుజరపాల్సిన అవసరం ఉండేదికాదన్నారు. 

రాష్ట్రంలో హిందూమతంపైదాడికి సంబంధించి,144వరకు ఘటన లు  జరిగితే, ప్రభుత్వం సిట్ వేశామంటూ తప్పించుకునే ధోరణితో వెళుతోందన్నారు.  దుర్యోధనుడు చెప్తే, దుశ్శాసనుడు చీర లాగినట్టు, ముఖ్యమంత్రి  కనుసన్నల్లోనే మంత్రులు, ఎమ్మెల్యేలు విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ మానసికవైకల్యంతో బాధపడుతున్నారని అశోక్ బాబు ఎద్దేవాచేశారు.

పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి, సుప్రీంకోర్టులో ప్రభుత్వానికి వ్యతిరేకంగానే తీర్పు వస్తుందనే తాము భావిస్తున్నామన్నారు. స్థానిక ఎన్నికల్లో వైసీపీ కిమద్ధతు లభించదనిభావించే, పాలకులు దుర్మార్గం చేశాలైనా సరే ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారన్నారు. అందులోభాగంగానే నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పోయేవరకు ఎన్నికలకు వెళ్లమని అధి కారపార్టీ వారు బహిరంగంగానే చెబుతున్నారన్నారు.

వైసీపీలో నిజంగా టీడీపీకోవర్టులుంటే, జగన్మోహన్ రెడ్డి ఇన్నాళ్లపాటు ముఖ్యమంత్రిగా కొనసాగేవాడుకాదని టీడీపీనేత తేల్చిచెప్పారు. ఎన్నికల్లో 151 సీట్లువచ్చాయని బలుపుతో, అహాంకారంతో మాట్లాడుతూ, పొలిటికల్ టెర్రరిజం నడపడం ప్రభుత్వానికే నష్టమ న్నారు. నిజంగా ప్రభుత్వానికి ఎన్నికలకు వెళ్లే ధైర్యముంటే, కోర్టు ల్లో వేసిన స్టేను తక్షణమే ఉపసంహరించుకొని, ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని కోర్టుకుచెప్పే ధైర్యముందా అని అశోక్ బాబు పాలకులనుప్రశ్నించారు.

ఎన్నికలంటే భయముండబట్టే, ప్రభుత్వం నిమ్మగడ్డకు భయపడుతూ, కరోనాను సాకుగా చూపుతోందన్నా రు.   ప్రభుత్వానికి చేతనైతే, చేవఉంటే, 18వతేదీన కోర్టులో జరిగే విచారణలో, తాము ఎన్నికలకు సిద్ధమేనని న్యాయమూర్తి ఎదుట ఒప్పుకోవాలని, అప్పుడే ప్రభుత్వం భయపడటం లేదని అందరూ భావిస్తారన్నారు. అమ్మఒడి, ఇళ్లస్థలాలతో పాటు, మద్యాన్ని ఫ్రీగా ఇచ్చినాకూడా ప్రజలఅభిప్రాయం మారదనే నిజాన్ని పాలకులు గ్రహిస్తే మంచిదన్నారు.

పంచాయతీ ఎన్నికల్లో ప్రజలుఎవరిపక్షాన ఉన్నారనేది త్వరలోనే ప్రభుత్వానికి అర్థమవుతుందన్నారు. ఎన్నికల కమిషనర్ గా ఎవరున్నా, ప్రజలనిర్ణయం మారదనే నిజాన్ని వైసీపీనేతలు, ముఖ్యమంత్రి గ్రహిస్తే మంచిదన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఘనంగా శ్రీ గోదాకల్యాణం.. ముగిసిన తిరుప్పావై ప్రవచనాలు