ఏపీలో బంద్ ప్రభావం : స్తంభించిన ప్రజారవాణా

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ, తక్షణం న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ వామపక్షాలు, కాంగ్రెస్ పార్టీలు ఇచ్చిన పిలుపుమేరకు

Webdunia
గురువారం, 8 ఫిబ్రవరి 2018 (11:22 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ, తక్షణం న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ వామపక్షాలు, కాంగ్రెస్ పార్టీలు ఇచ్చిన పిలుపుమేరకు రాష్ట్రంలో బంద్ జరుగుతోంది. ఈ బంద్ కారణంగా గురువారం తెల్లవారుజాము నుంచే వాహనాల రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. 
 
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని డిపోల ఎదుటా బైఠాయించిన సీపీఐ, సీపీఎం నేతలు, బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు. రహదారులపై నిరసన తెలిపి ప్రైవేటు వాహనాలను కూడా ఎక్కడికక్కడ నిలిపేస్తుండటంతో జనజీవనం స్తంభించింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా బంద్‌కు మద్దతు పలికింది. 
 
పలు ప్రాంతాల్లో వ్యాపారులు స్వచ్ఛందంగానే తమ దుకాణాలను మూసివేయగా, ప్రజలు కూడా బంద్‌లో పాల్గొంటున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు కూడా మూతపడ్డాయి. అత్యవసర వాహనాలు మినహా మరే వాహనాలు రహదారులపై కనిపించడం లేదు. 
 
ఈ బంద్‌కు అధికార టీడీపీ కూడా మద్దతు ప్రకటించింది. ఆ పార్టీకి చెందిన నేతలు పలు ప్రాంతాల్లో శాంతియుత ర్యాలీలు నిర్వహించారు. అలాగే, సినీ హీరో పవన్ కళ్యాణ్ సారథ్యంలోని జనసేన పార్టీ కూడా ఈ బంద్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bandla Ganesh: బండ్ల గణేష్ పై ఇండస్ట్రీ సీరియస్ - గబ్బర్ సింగ్ లాంటి సినిమా తీయలేనా?

Manoj: ఎవరినీ మోసం చేయను, మౌనిక ను బాగా చూసుకుంటా : మంచు మనోజ్

ప్రైమ్ వీడియోలో మా దృష్టి గొప్ప కథలను నిర్మించడం మీదే ఉంది - పద్మా కస్తూరిరంగన్

ప్రణవ్ మోహన్ లాల్.. డీయస్ ఈరే... శ్రీ స్రవంతి మూవీస్ ద్వారా విడుదల

పురుషః పాత్రల ఫస్ట్ లుక్ ఆవిష్కరించిన డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

తర్వాతి కథనం
Show comments