Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పార్లమెంట్ తలుపులు మూసి విభజించారు.. ఆంధ్రాకు అండగా ఉంటాం : ప్రధాని మోడీ

మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వ హయాంలో మూడు రాష్ట్రాలను ఏర్పాటు చేయడం జరిగిందనీ, కానీ, ఏ ఒక్క రాష్ట్రంలో కూడా విభజన సమస్యలు తలెత్తలేదని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు.

Advertiesment
Narendra Modi
, బుధవారం, 7 ఫిబ్రవరి 2018 (13:21 IST)
మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వ హయాంలో మూడు రాష్ట్రాలను ఏర్పాటు చేయడం జరిగిందనీ, కానీ, ఏ ఒక్క రాష్ట్రంలో కూడా విభజన సమస్యలు తలెత్తలేదని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. కానీ, గత యూపీఏ ప్రభుత్వం ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పార్లమెంట్ తలపులు మూసిమరీ విభజన చేసిందనీ ఆ కారణంగానే ఇన్ని సమస్యలు ఉత్పన్నమయ్యాయని ఆరోపించారు. అదేసమయంలో విభజన సమయంలో తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌కు తాము అండగా ఉంటామని చెప్పామని తెలిపారు. 
 
రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపుతూ ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం లోక్‌సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పిస్తూ, స్వర్గీయ ఎన్టీఆర్‌ను గుర్తు చేస్తూ తన ప్రసంగాన్ని కొనసాగించారు. టీడీపీ ఎంపీల నిరసనలు కొనసాగుతున్నప్పటికీ ఆయన తన ప్రసంగాన్ని కొనసాగించారు. 
 
తన ప్రసంగంలో టీడీపీ ఆవిర్భావం నాటి పరిస్థితుల్ని మోడీ గుర్తుచేశారు. సగటు మనిషి ఆక్రోశం నుంచి టీడీపీ పుట్టిందన్నారు. ఎన్టీఆర్ పేరును ప్రస్తావించిన ఆయన తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో ఎన్టీఆర్ పోరాడారని కొనియాడారు. ఏపీలో కాంగ్రెస్ చేసిన రాజకీయ దారుణాలు అనేకమన్నారు. అలాంటి కాంగ్రెస్ అరాచకాలకు వ్యతిరేకంగా పుట్టిన పార్టీయే టీడీపీ అని ప్రధాని నరేంద్ర మోడీ గుర్తు చేశారు. 
 
ఏపీ విభజన సమయంలో కాంగ్రెస్ తీరు వల్లే రాష్ట్రానికి ఇప్పుడు సమస్యలు వచ్చాయని, రాష్ట్రాన్నే కాదు.. దేశాన్ని కూడా కాంగ్రెస్ మోసం చేసిందని మండిపడ్డారు. ఎన్డీయే ప్రభుత్వం మూడు కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేసిందని, అప్పుడు ఏ రాష్ట్రానికీ ఇలాంటి అన్యాయం జరగలేదని, ఎవరికి ఇవ్వాల్సినవి వారికి ఇవ్వడం వల్ల అప్పట్లో సమస్య రాలేదని, అలాంటి మహోన్నత చరిత్ర ఎన్డీఏ ప్రభుత్వానికి ఉందన్నారు. 
 
రాజకీయ ప్రయోజనాలుకాకుండా ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని అప్పట్లో కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేశారని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం పార్లమెంట్‌ తలుపులు మూసి హడావుడిగా ఏపీని విభజించిందని ప్రధాని మోడీ గుర్తు చేశారు. రెండు రాష్ట్రాలకూ న్యాయం జరుగుతుందనే తెలంగాణ ఏర్పాటుకు మద్దతిచ్చామని, కానీ, ఏపీ తీవ్రంగా నష్టపోయిందన్నారు. ఆ రాష్ట్రానికి ఆయన అండగా ఉంటామని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అరాచకాల కాంగ్రెస్సా.. ఏపీ గురించి మాట్లాడేది?: ప్రధాని మోదీ