Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అయ్యా... లే అయ్యా... నీ కోసం ఎంత మంది వచ్చారో చూడయ్యా...

డెంగీ జ్వరం కారణంగా చనిపోయిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, శాసనమండలి సభ్యుడు గాలి ముద్దుకృష్ణమ నాయుడు అంత్యక్రియలు ఆయన స్వగ్రామంలో గురువారం సాయంత్రం ప్రభుత్వ లాంఛనాలతో జరుగనున్నాయి.

అయ్యా... లే అయ్యా... నీ కోసం ఎంత మంది వచ్చారో చూడయ్యా...
, గురువారం, 8 ఫిబ్రవరి 2018 (10:33 IST)
డెంగీ జ్వరం కారణంగా చనిపోయిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, శాసనమండలి సభ్యుడు గాలి ముద్దుకృష్ణమ నాయుడు అంత్యక్రియలు ఆయన స్వగ్రామంలో గురువారం సాయంత్రం ప్రభుత్వ లాంఛనాలతో జరుగనున్నాయి. గత రెండు నెలల క్రితం గుండె ఆపరేషన్ చేయించుకున్న ముద్దుకృష్ణమకు గత నాలుగు రోజుల క్రితం అనారోగ్యం చేసింది. దీంతో ఆయనను హైదరాబాద్‌లోని కేర్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతుండగా డెంగీ జ్వరం వచ్చింది. దీంతో ఆయన మంగళవారం అర్థరాత్రి హఠాన్మరణం చెందారు. దీంతో ఆయన కుటుంబ సభ్యులతో పాటు.. టీడీపీ శ్రేణులు దిగ్భ్రాంతికి గురయ్యారు. 
 
అయితే, ముద్దుకృష్ణమ నాయుడు చనిపోయే ముందు తన భార్య, పిల్లల కంటే కూడా ఓ వ్యక్తిని చూడాలని పరితపించాడు. అతన్ని తక్షణం హైదరాబాద్‌కు పిలిపించాలని తన కుటుంబ సభ్యుల ద్వారా కబురుబెట్టాడు. ఆ వ్యక్తి ఎవరో తెలుసా. తన నమ్మినబంటు. గడచిన 20 సంవత్సరాలుగా తన వాహన డ్రైవరుగా, వ్యక్తిగత సహాయకుడిగా, నమ్మినబంటుగా ఉన్న వ్యక్తి చంద్ర. గాలి ముద్దుకృష్ణమనాయుడితో రెండు దశాబ్దాల పాటు నడిచిన చంద్రే, గతవారం జ్వరంతో ఉన్న ఆయన్ను రేణిగుంట విమానాశ్రయానికి తీసుకెళ్లి హైదరాబాద్ విమానం ఎక్కించారు. 
 
కేర్ ఆసుపత్రిలో చేరి డెంగ్యూ జ్వరానికి చికిత్స పొందుతున్న వేళ, పరిస్థితి విషమించింది. ఆపై తన కుటుంబీకులతో చంద్రను పిలిపించాలని, వాడిని చూడాలని ఉందని గాలి చెప్పారట. విషయాన్ని చంద్రకు చేరవేసిన బంధువులు, అతన్ని హుటాహుటిన మంగళవారం నాడు హైదరాబాద్‌కు రప్పించారు. అప్పటికే గాలి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. ఆయన్ను చూసిన చంద్ర కుదేలయ్యాడు. ఆయన మరణించిన తర్వాత 'అయ్యా... లే అయ్యా... నీ కోసం ఎంత మంది వచ్చారో చూడయ్యా' అంటూ బోరున విలపిస్తుండటం ఇతరులను కూడా కంటతడిపెట్టించింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రేణుకా చౌదరిని మోదీ ఇలా అనేశారే? రామాయణం తర్వాత ఆ నవ్వును..?