Webdunia - Bharat's app for daily news and videos

Install App

అరుణ్ జైట్లీని అటాడుకోండి : ఎంపీలతో చంద్రబాబు

విభజన వల్ల నష్టపోయిన ఏపీకి తగినన్ని నిధులు కేటాయించకుండా మోసం చేసిన కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రసంగాన్ని అడ్డుకోవాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన సొంత పార్టీ ఎంపీలకు పిలుపునిచ్చారు. వ

Webdunia
గురువారం, 8 ఫిబ్రవరి 2018 (10:41 IST)
విభజన వల్ల నష్టపోయిన ఏపీకి తగినన్ని నిధులు కేటాయించకుండా మోసం చేసిన కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రసంగాన్ని అడ్డుకోవాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన సొంత పార్టీ ఎంపీలకు పిలుపునిచ్చారు. వార్షిక బడ్జెట్‌పై జైట్లీ సమాధానం ఇచ్చే సమయంలో ఆయన ప్రసంగానికి అడ్డు తగలాలని ఆయన ఆదేశించారు. 
 
కాగా, వార్షిక బడ్జెట్‌లో నిధుల కేటాయింపులో మొండిచేయి చూపడంతో అధికార టీడీపీ ఎంపీలు గుర్రుగా ఉన్న విషయం తెల్సిందే. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి టీడీపీ ఎంపీలు దూకుడుగా వ్యవహరిస్తూ, ఉభయసభల్లో నిరసన కార్యాక్రమాలు చేస్తున్నారు. ఇవి గత నాలుగు రోజులుగా కొనసాగుతున్నాయి. 
 
తమ అధినేత చంద్రబాబు సూచనల మేరకు ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగం సమయంలో కొంతమేరకు శాంతించిన టీడీపీ ఎంపీలు... ప్రధాని మోడీ నుంచి ఏపీ ప్రయోజనాలకు సంబంధించి ఎలాంటి హామీలు రాకపోవడంతో ఎంపీలు మళ్లీ ఆందోళనలకు దిగారు. ఈ నేపథ్యంలో, సస్సెన్షన్‌కు కూడా గురయ్యారు. తాజాగా పార్లమెంటులో ఈరోజు వ్యవహరించాల్సిన తీరుపై టీడీపీ ఎంపీలకు చంద్రబాబు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. 
 
ఉభయసభల్లో ఆందోళనలను తీవ్రతరం చేయాలని ఆదేశించారు. ఈ మేరకు గురువారం ఎంపీలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బడ్జెట్‌పై అరుణ్ జైట్లీ సమాధానం చెప్పేటప్పుడు ఆందోళనలు, నిరసనలు చేపట్టాలని, నినాదాలు చేయాలని సూచించారు. ఏ క్షణంలోకూడా వెనక్కి తగ్గవద్దని, సభ నుంచి గెంటేసినా ఫర్వాలేదనీ ఆయన తేల్చి చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ ఇంట్లో రష్మిక దీపావళి వేడుకలు... డేటింగ్‌లో 'గీతగోవిందం' జంట

దణ్ణం పెట్టి చెబుతున్నా... రాజకీయాలకు గుడ్ బై: పోసాని కృష్ణమురళి (video)

పుష్ప-2 వైల్డ్ ఫైర్ కోసం వేచి వుండలేకపోతున్నా బన్నీ.. శిల్పా రవి (video)

చిరంజీవికి, చెర్రీలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన నయనతార.. ఎందుకు?

మోహన్ బాబుకు ఏడాదిపాటు 50 ఏళ్ల వేడుకలు చేయనున్న మంచు విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

రక్తవృద్ధికి తోడ్పడే ఖర్జూరాలు

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండటానికి 8 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments