Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు - కానిస్టేబుల్ సస్పెండ్

Webdunia
ఆదివారం, 5 జూన్ 2022 (13:51 IST)
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసిన పోలీస్ కానిస్టేబుల్‌పై ఏపీ డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ ఆదేశం మేరకు చర్యలు తీసుకున్నారు. వాట్సాప్ గ్రూపులో పోస్ట్ చేసినందుకు నక్కపల్లి పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పని చేస్తున్న నవీన్ కుమార్ శెట్టిన అనకాపల్లి జిల్లా ఎస్పీ గౌతమిసాలి సస్పెండ్ చేశారు. 
 
అచ్యుతాపురం బ్రాండిక్స్‌లో అమ్మోనియం విషవాయువుల ప్రభావంతో అస్వస్థతకు గురైన అంశానికి సంబంధించిన పోస్టు చివరలో "అన్న వచ్చాడు. అస్వస్థతకు తెచ్చాడు" అంటూ క్యాప్షన్ పెట్టి పోలీస్ వ్యాట్సాప్‌లో గ్రూపు షేర్ చేసినట్టు నవీన్ కుమార్‌పై ప్రాథమిక ఆరోపణలు ఉన్నట్టు తెలుస్తోంది. 
 
ఈ వ్యవహారంపై ఇన్‌స్పెక్టర్ స్థాయి అధికారితో అనకాపల్లి ఎస్పీ గౌతమిసాలి ఆదేశించారు. అయితే, ఏపీ ప్రభుత్వంపై కానీ సీఎ జగన్‌పై కానీ కించపరిచేవిధంగా పోస్టులు, వ్యాఖ్యలు చేసిన వారిపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించినట్టు కనిపిస్తోంది. గత కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై ప్రత్యేక నిఘా పెట్టి వారిని అదుపులోకీ తీసుకుని విచారిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

ఎన్టీఆర్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఎన్టీఆర్ నీల్’ వ‌ర్కింగ్ టైటిల్‌తో చిత్రం ప్రకటన

2024 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో తెనాలి అమ్మాయి..

మూడు డిఫరెంట్ వేరియేషన్స్ తో అజిత్ కుమార్ ద్విభాషా చిత్రం గుడ్ బ్యాడ్ అగ్లీ

ఎన్టీఆర్ ‘దేవర’ నుంచి అనిరుద్ సారథ్యంలో ఫియర్ సాంగ్’ న్యూ లుక్ విడుదల

'సిరివెన్నెల'కు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments