తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. దీంతో మాంసాహార ప్రియులు లబోదిబోమంటున్నారు. గత కొన్ని రోజులుగా చికెన్ ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. కిలో చికెన్ ధర రూ.300గా ఉంది. బ్రాయిలర్ చికెన్ స్కిన్ లెస్ ధర రూ.320గా ఉండతో స్కిన్‌తో అయితే, ఈ ధర రూ.260గా వుంది. ఇక నాటు కోడి ధరలు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నాటు కోడి కేజీ చికెన్ ధర రూ.500గా వుంది. విజయవాడలో అయితే, కోడి మాంసం ధర రూ.850గా వుంది.
ఈ యేడాది ఆరంభంలో కిలో చికెన్ ధర రూ.200 నుంచి రూ.230 వరకు పలికింది. ఆ తర్వాత రికార్డు స్థాయిలో ఈ ధర రూ.280కు చేరింది. ఆ తర్వాత మళ్ళీ తగ్గుతూ మే ఒకటో తేదీ నాటికి రూ.228కు చేరింది.
కానీ, కరోనా మహమ్మారి సమయంలో వీటి ధరలు అమాంతం దిగివచ్చాయి. కిలో చికెన్ వంద రూపాయల కంటే తక్కువకు పడిపోయాయి. కానీ, కరోనా సెకండ్ వేవ్ తర్వాత వీటి ధరలు ఒక్కసారిగా క్రమంగా పెరుగుతూ వచ్చాయి.
ఇపుడు వేసవి సీజన్‌కి డిమాండ్ మరింత పెరిగిపోవడం, డిమాండ్‌కు తగిన విధంగా సరఫరా లేకపోవడంతో వీటి ధరలు అమాంత్ పెరిగనట్టు వ్యాపారులు చెబుతున్నారు. సాధారణంగా కోళ్లు వేసవిలో బరువు పెరిగేందుకు ఎక్కువ సమయం పడుతుంది. అందుకే సరఫరా తగ్గిపోయిందని అంటున్నారు. చికెన్ ధరలు పెరగడానికి కోళ్ళ దానా కూడా విపరీతంగా పెరిగిపోవడం మరో కారణంగా ఉంది.