Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆంజనేయ స్వామి సాక్షిగా అమ్మాయిపై బ్లేడుతో దాడి

blade attack
, సోమవారం, 25 ఏప్రియల్ 2022 (14:19 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనకాపల్లిలో దారుణం జరిగింది. ఈ రాష్ట్రంలోని అనకాపల్లి జిల్లా వి.మాడుగులలో ఓ ఉన్మాది ఒక యువతిని బ్లేడుతో గొంతు కోశారు. ఈ ఘటన స్థానిక ఆంజనేయ స్వామి ఆలయంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
వి.మాడుగుల గ్రామానికి చెందిన నగేశ్ అనే ఉన్మాది ఓ యువతి వెంటబడి ప్రేమిస్తున్నాంటూ వేధించసాగాడు. అయితే, ఆ యువతి నగేశ్ ప్రేమను తిరస్కరించింది. దీంతో కక్ష పెంచుకున్న నగేశ్ ఆ యువతి తనకు దక్కకుంటే మరెవ్వరికీ దక్కకూడదన్న ప్రతీకారంతో రగిలిపోయాడు. 
 
ఈ క్రమంలో సోమవారం ఉదయం స్థానికంగా ఉండే ఆంజనేయ స్వామి గుడికి వెళ్లిన ఆ యువతిని అనుసరించిన ఉన్మాది నగేశ్... అప్పటికే పక్కా ప్రణాళికతో తన వద్ద ఉన్న బ్లేడుతో ఆ యువతిపై దాడి చేయడంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. దీన్ని గమనించిన స్థానికులు బాధిత యువతిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. 
 
గతంలో కూడా ఈ యువతిపై నగేశ్ ఇదే విధంగా దాడి చేసిన సంఘటనలు ఉన్నాయి. అయితే, అపుడు పోలీసులు నగేశ్‌కు వార్నింగ్ ఇచ్చి వదిలివేశారు. ఇపుడు ఏకంగా ఆ యువతిపై బ్లేడుతో దాడిచేశాడు. దీంతో అతన్ని పోలీసులు అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీలో ప్రభుత్వ ఉపాధ్యాయులకు షాక్.. మే 20వరకు సెలవులు రద్దు