ఏపీలో ప్రభుత్వ ఉపాధ్యాయులకు రాష్ట్ర ప్రభుత్వం సెలవులు రద్దు చేసింది. మే 20వరకు సెలవులను రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
మెడికల్ ఎమర్జెన్సీకి మాత్రమే సెలవులు మంజూరు చేస్తామని ఉత్తర్వుల్లో పేర్కొంది. రాష్ట్రంలోని పాఠశాలలకు మే 6 నుంచి జులై 3 వరకు సెలవులు ప్రకటిస్తూ పాఠశాల విద్యాశాఖ శనివారం ఆదేశాలు జారీ చేసింది.
జులై 4 నుంచి కొత్త విద్యాసంవత్సరం ప్రారంభం కానుంది. ప్రభుత్వ తాజా ఉత్తర్వుల నేపథ్యంలో మే 20 తర్వాతే ఉపాధ్యాయులకు సెలవులు అందుబాటులోకి వస్తాయి.
ఏపీ పాఠశాలలకు వేసవి సెలవులు ప్రకటించారు. మే 6వ తేదీ నుంచి రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు ప్రభుత్వం సమ్మర్ హాలిడేస్ ప్రకటించింది. మే 4వ తేదీ నాటికి అన్ని తరగతుల పరీక్షలు పూర్తి చేయాలని విద్యాశాఖ ఆదేశించింది.