Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజ‌య‌వాడలో రూ.100 కోట్ల‌తో అమృత్ ధార‌! 24X7 !!

Webdunia
శనివారం, 14 ఆగస్టు 2021 (18:06 IST)
విజ‌య‌వాడ న‌గ‌రంలో ఇంటింటికి రక్షిత మంచి నీటిని అందించేందుకు వంద కోట్ల రూపాయ‌ల‌తో అమృత్ పథకానికి శ్రీ‌కారం చుట్టారు.

విజ‌య‌వాడలో మంచినీటి సరఫరా, మురుగునీరు, వరద నీరు పారుదల, పారిశుద్ధ్య కార్యక్రమాలు, చెత్త సేకరణ వంటి పనులు సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్ర‌భుత్వం చ‌ర్య‌లు చేపట్టింది. ఇంటింటికి రక్షిత మంచినీటిని అందించేందుకు రూ.100.07 కోట్లతో అమృత్ పథకానికి శ్రీ‌కారం చుట్టిన్న‌ట్లు పుర‌పాల‌క ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ తెలిపారు.

విజ‌య‌వాడ‌లోని ఐనాక్స్ థియేటర్ వెనుక సాంబమూర్తి రోడ్డులో అమృత్ పథకంలో భాగంగా 24X7 మంచి నీటి సరఫరాను ప‌థ‌కానికి మంత్రి వెలంప‌ల్లి శ్రీ‌నివాస‌రావు, న‌గ‌ర మేయ‌ర్ రాయ‌న భాగ్య‌ల‌క్ష్మి, సెంట్ర‌ల్ ఎమ్మెల్యే మ‌ల్లాది విష్ణు, జిల్లా క‌లెక్ట‌ర్ జె.నివాస్, న‌గ‌రపాల‌క సంస్థ క‌మిష‌న‌ర్ ప్ర‌స‌న్న వెంక‌టేష్, డిప్యూటి మేయ‌ర్లు బెల్లం దుర్గ‌, ఆవుతు శ్రీశైల‌జారెడ్డి, ప‌లువురు న‌గ‌రపాల‌క సంస్థ‌ కార్పొరేట‌ర్లల‌తో క‌లిసి మంత్రి బొత్స సత్యనారాయణ శుంకుస్థాప‌న చేశారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి బొత్స స‌త్య‌న్నారాయ‌ణ మాట్లాడుతూ, నగరంలో తాగునీటి సమస్య లేకుండా చేయాలనేది ప్రభుత్వ లక్ష్యం అన్నారు. అమృత్ పథకం ద్వారా కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల‌ నిధులతో పాటు న‌గ‌రపాల‌క సంస్థ నిధుల‌తో ఏడాది లోపు నిర్మాణం పూర్తి చేసి అందుబాటులోకి తీసుకువ‌స్తామ‌ని పేర్కొన్నారు. ఈ ప‌ధకం ద్వారా న‌గ‌రంలో 29 వార్డుల‌కు 24గంట‌ల‌పాటు మంచినీటి సరఫరాను అందిస్తామ‌న్నారు.

విజయవాడకు మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ప‌నిచేస్తుంద‌న్నారు. కార్య‌క్ర‌మంలో చీఫ్ ఇంజనీర్ యం.ప్రభాకరరావు, ఈఈ శ్రీ‌నివాసు, ఇంజ‌నీరింగ్ విభాగం అధికారులు, ఏడిహెచ్ జె.జ్యోతి, త‌దిత‌రులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తమన్నా కెరీర్‌కు 20 యేళ్లు... యాక్టింగ్‌ను ఓ వృత్తిగా చూడలేదంటున్న మిల్కీబ్యూటీ!

ఎన్టీఆర్ వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నాను : కె.రాఘవేంద్ర రావు

ఆర్య 2, ఆదిత్య 369 సినిమాలకు అంతక్రేజ్ దక్కలేదా?

సీతారాములు, రావణుడు అనే కాన్సెప్ట్‌తో కౌసల్య తనయ రాఘవ సిద్ధం

మరో వ్యక్తితో శృంగారం కోసం భర్తను మర్డర్ చేసే రోజులొచ్చాయి, నీనా గుప్తాకి రివర్స్ కామెంట్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం