Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహాత్మాగాంధీకి అత్యున్నత పౌర పురస్కారం.. ఈ అవార్డు పొందనున్న మొదటి వ్యక్తి..?

Webdunia
శనివారం, 14 ఆగస్టు 2021 (17:39 IST)
జాతిపిత మహాత్మా గాంధీకి అరుదైన అత్యున్నత పౌర సత్కారం లభించింది. మహాత్మా గాంధీని ప్రతిష్ఠాత్మక కాంగ్రెషనల్ గోల్డ్ మెడల్ పురస్కారంతో గౌరవించుకోవాలని అమెరికా ప్రతినిధులు తీర్మానించారు. 
 
న్యూయార్క్​ ప్రజాప్రతినిధి కరోలిన్ ఈ ప్రతిపాదనను సభ ముందు ఉంచగా సభ్యులు ఆమోదం తెలిపారు. కాంగ్రెషనల్ గోల్డ్ మెడల్‌ను అమెరికాలోనే అత్యున్నత పౌర పురస్కారంగా పరిగణిస్తారు.

నెల్సన్ మండేలా, ఆంగ్‌సాంగ్‌ సూకీ సహా పలువురికి ఈ మెడల్ అందించారు. అయితే, మరణానంతరం ఈ పురస్కారం పొందనున్న మొదటి వ్యక్తి మహాత్మా గాంధీ కానున్నారు.
 
మహాత్మా గాంధీ చేపట్టిన సత్యాగ్రహ ఉద్యమం, ఆయన చూపిన అహింస మార్గాలు.. దేశానికి, ప్రపంచానికి ఎంతో స్ఫూర్తినిచ్చాయన్నారు అమెరికా ప్రజాప్రతినిధులు. ఇతరులకు సేవ చేయడం కోసం సర్వస్వాన్ని ఇచ్చేయడం అనే దానికి గాంధీ ఓ ఉదాహరణ అని కొనియాడారు. 
 
ప్రపంచానికి శాంతి, అహింస మార్గాలు చూపి.. మానవాళికి ప్రేరణగా నిలిచిన గాంధీకి ఈ పురస్కారాన్ని ఇవ్వాలని చట్టసభ్యురాలు కరోలిన్ కోరారు. దీంతో కాంగ్రెషనల్ గోల్డ్​ మెడల్‌తో గాంధీని గౌరవించుకోవాలని ప్రతినిధుల సభ మరోసారి తీర్మానించింది.

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments