Webdunia - Bharat's app for daily news and videos

Install App

త్వరలో విశాఖ నుండే పరిపాలన : మంత్రి పెద్దిరెడ్డి

Webdunia
గురువారం, 13 ఫిబ్రవరి 2020 (08:46 IST)
త్వరలో జరగనున్న బడ్డెట్‌ సమావేశాల తర్వాత విశాఖ నుండి ఏ రోజైనా పరిపాలన ప్రారంభించవచ్చని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు.

సచివాలంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ…  స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామ, మున్సిపాలిటీ, కార్పోరేషన్లలో ప్రజల సమస్యలను తీర్చే వ్యక్తులే గ్రామ సర్పంచ్‌లుగా ఉండాలన్నదే ప్రభుత్వ ఉద్దేశ్యమన్నారు.

ఆర్థిక స్తోమతగల కొంత మంది తమ వ్యక్తి గత ప్రతిష్ట కోసం స్థానిక సంస్థల పదవులకు పోటీ చేస్తున్నారన్నారు. గెలిచిన తరువాత ఆ గ్రామ, వార్డు, మున్సిపాలిటీ, డివిజన్‌ల అభివృద్ధిని పట్టించుకోవడం లేదన్నారు.

పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు అభ్యర్ధులు మద్యం, డబ్బు పంపిణీకి పాల్పడినట్లు రుజువైతే సదరు వ్యక్తులు గెలిచిప్పటికీ ఆయా పదవుల్లో నుండి తొలగిస్తామన్నారు.

సెక్షన్‌ 211 ప్రకారం ప్రత్యక్ష, పరోక్షంగా ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తే 3 సంవత్సరాల జైలు శిక్ష, రూ.10వేల జరిమానా పడుతుందని తెలిపారు.

స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ కాలపరిమితిని సెక్షన్‌ 201-ఎ(1), ఎ(2) ద్వారా తగ్గిస్తూ తీర్మానించినట్లు తెలిపారు. ఎంపిటిసి, జెడ్పీటిసి ఎన్నికలు 18 రోజులు, గ్రామపంచాయితీ ఎన్నికలు 13 రోజుల్లో నిర్వహించాలని పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments