విశాఖ శారదా పీఠంలో సీఎం జగన్
విశాఖ శారదాపీఠాన్ని సందర్శించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర ఆశీస్సులు అందుకున్న సీఎం. రాజశ్యామల అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు. పీఠాధిపతులతో కలిసి జమ్మిచెట్టు చుట్టూ ప్రదక్షిణ.
శారదాపీఠం ప్రాంగణంలో గోమాతకు పూజలు చేసిన సీఎం జగన్. స్వయం జ్యోతి మండపం శిలాఫలకాన్ని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. తిరుమల తిరుపతి దేవస్థానం చేపట్టిన శ్రీనివాస చతుర్వేద హవనం పూర్ణాహుతిలో పాల్గొన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దంపతులు.
లోక కల్యాణార్థం విశాఖ శారదాపీఠం చేపట్టిన రాజశ్యామల యాగం పూర్ణాహుతికి హాజరైన సీఎం జగన్. ముఖ్యమంత్రి వెంట మంత్రి అవంతి శ్రీనివాస్, ఎమ్మెల్యే అదీప్ రాజు, రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి, టిటిడి పాలక మండలి సభ్యులు ప్రశాంతిరెడ్డి, నాదెళ్ల సుబ్బారావు, శేఖర్ రెడ్డి తదితరులు.