Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రెసిడెంట్ గారు చాలా దెబ్బలు కొట్టారు... బండరాయి బద్ధలవుతుంది : నాగబాబు

Webdunia
శనివారం, 14 మార్చి 2020 (12:59 IST)
ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీతోపాటు... అధికారం కోల్పోయిన పార్టీని మన ప్రెసిడెంట్ గారు చాలా దెబ్బలు కొట్టారని, ఒక రోజున కుళ్లిన రాజకీయాలు అనే బండరాయి బద్ధలవుతుందని సినీ నటుడు, జనసేన నేత నాగబాబు చెప్పుకొచ్చారు. 
 
జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాజమండ్రిలో ఆ పార్టీ ముఖ్యనేతలందరూ సమావేశమై ప్రసంగిస్తున్నారు. ఇందులో నాగబాబు మాట్లాడుతూ నాలుగేళ్లలో జనసేన అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు. 
 
అలాగే, 'జనసేన ఆవిర్భావ దినోత్సవంలో తొలిసారి మాట్లాడుతున్నాను. ఎక్కువ సమయం మాట్లాడదలుచుకోలేదు. పవన్‌ కల్యాణ్‌, నాదెండ్ల మనోహర్‌ వంటివారు ఉన్నారు. వారు మాట్లాడేందుకు ప్రాధాన్యతనిస్తాను. అందుకే క్లుప్తంగా మాట్లాడుతానని చెప్పారు. 
 
ఇకపోతే, ఆంధ్రప్రదేశ్ స్థానిక ఎన్నికల్లో నామినేషన్‌ వేస్తున్నవారిని తన్నడం కత్తులతో పొడవడం వంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. అయినప్పటికీ స్థానిక ఎన్నికల్లో జనసేన అభ్యర్థులు నామినేషన్లు వేశారు. భయపడకండి.. ఇటువంటి బెదిరింపులు మామూలే. ఎందుకంటే హిట్లర్‌ కంటే గొప్పోడు ఎవరూ లేడిక్కడ. అటువంటి వాడే పతనమైపోయాడు. ఇది కూడా ఎంతో కాలం పట్టదు అని జోస్యం చెప్పారు. 
 
'బండరాయి మీద ఓ దెబ్బేస్తే అది పగలదు. 99 దెబ్బలేసినా పగలదు.. 100వ దెబ్బేస్తే పగులుతుంది. మన పవన్‌ కల్యాణ్.. మన ప్రెసిడెంట్‌ గారు చాలా దెబ్బలు కొట్టారు. ఒకరోజు కుళ్లిన రాజకీయాలు అనే బండరాయి బద్దలయ్యే రోజు వస్తుంది. నాలుగేళ్లలో జనసేన అధికారంలోకి వస్తుంది' అని నాగబాబు అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బెనెగల్ చిత్రాలు భారత సంస్కృతి సంపద : చిరంజీవి

బెంగాలీ దర్శకుడు శ్యామ్ బెనెగల్ కన్నుమూత

Peelings: పీలింగ్స్ పాటలో అల్లు అర్జున్ ఎత్తుకుంటే భయమేసింది.. అసౌకర్యంగా?

అల్లు అర్జున్ ఇష్యూకు చిరంజీవి సీరియస్ - రేవంత్ రెడ్డి పీఠానికి ఎసరు కానుందా?

బాలకృష్ణ కెరీర్ లో గుర్తుండిపోయే చిత్రం డాకు మహారాజ్ : చిత్ర దర్శక నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

ఏ పాత్రల్లోని వంట ఆరోగ్యానికి మంచిది? ఏవి మంచివి కావు?

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

తర్వాతి కథనం
Show comments