Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

దేశ ప్రజలకు ఈ బడ్జెట్‌తో ఆశించినంత ఆశించినంత ఉపాధి.. ఆర్థిక మంత్రి

దేశ ప్రజలకు ఈ బడ్జెట్‌తో ఆశించినంత ఆశించినంత ఉపాధి.. ఆర్థిక మంత్రి
, శనివారం, 1 ఫిబ్రవరి 2020 (11:40 IST)
దేశ ప్రజలకు ఈ బడ్జెట్‌తో ఆశించినంత ఉపాధి దొరుకుందని, వ్యాపారాలు వృద్ధి చెందుతాయని, మైనార్టీలకు, మహిళలకు, ఎస్సీఎస్టీల ఆశలను నెరవేర్చే విధంగా 2020 బడ్జెట్ ఉండబోతోందని నిర్మల సీతారామన్ గుడ్ న్యూస్ చెప్పారు. సంపదను సృష్టించడమే లక్ష్యమని ఆమె పేర్కొన్నారు.

దేశంలోని ఆర్థిక వ్యవస్థలో నెలకొన్ని ఉన్న మందగమన పరిస్థితులను దూరం చేసేందుకు తమ సర్కారు చిత్తశుద్ధితో కృషి చేస్తోందని బడ్జెట్ ప్రసంగం సందర్భంగా నిర్మలా సీతారామన్ వెల్లడించారు. 
 
ఆర్థిక వ్యవస్థలో ప్రధాన పాత్ర పోషిస్తున్న సూక్ష్మ, చిన్న, మధ్య తరగతి పరిశ్రమల వారికి రావాల్సిన సర్కారు బకాయిల చెల్లింపును వేగవంతం చేసినట్టుగా ఆమె తెలిపారు. భారత ఆర్థిక వ్యవస్థను 5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చేందుకు గాను తాము అన్ని చర్యలు చేపడుతున్నట్టుగా మంత్రి తెలిపారు.
 
ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ రెండో సారి కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు. ఈ సందర్భంగా జీడీపీతో ప్రభుత్వ రుణభారం తగ్గిందని చెప్పుకొచ్చారు. గతేడాది మార్చిలో ఇది 48.7 శాతం తగ్గిందన్నారు. ప్రధాన మంత్రి గృహ ఆవాస యోజన పథకంతో దేశ వ్యాప్తంగా ప్రజలకు గృహ వసతి లభించిందన్నారు. కొత్తగా 60 లక్షల మంది పన్ను చెల్లింపుదారులుగా మారినట్లు ఆమె తెలిపారు.
 
ద్రవ్యోల్బణం అదుపులోకి వచ్చినట్లు చెప్పినట్లు ఆమె.. ఈ బడ్జెట్ సామాన్య ప్రజల ఆకాంక్షలకు ప్రతీకగా ఉంటుందని పేర్కొన్నారు. ఈజ్ ఆఫ్ లివింగ్ పదాన్ని పదేపదే ప్రస్థావించిన నిర్మలా.. మోదీ ప్రభుత్వం చేపట్టిన వివిధ సంస్కరణలను గుర్తు చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జియో కూడా షేక్ అవ్వాల్సిందే.. రూపాయికే వన్ జీబీ డేటా