Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రెండోసారి బడ్జెట్ ప్రవేశపెట్టనున్న తెలుగింటి కోడలు

Advertiesment
Budget 2020
, శనివారం, 1 ఫిబ్రవరి 2020 (10:02 IST)
కేంద్ర ఆర్థిక మంత్రిగా తెలుగింటి కోడలైన నిర్మలా సీతారామన్ కొనసాగుతున్నారు. ఈమె సారథ్యంలోని కేంద్ర ఆర్థిక శాఖ బృందం 2020-21వ సంవత్సరానికిగాను బడ్జెట్‌ను రూపకల్పన చేసింది. ఈ బడ్జెట్‌ను నిర్మలాసీతారమన్ శనివారం మధ్యాహ్నం 11 గంటలకు లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు. వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుండటం ఇది రెండోసారి కావడం గమనార్హం. 
 
కాగా, ప్రస్తుతం దేశంలో నిరుద్యోగం, ఆర్థిక లోటుతో దేశ ఆర్థికవ్యవస్థ తిరోగమనంలో ఉన్న నేపథ్యంలో నిర్మలా సీతారామన్ 2020-21 కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టే బడ్జెట్‌పై దేశ ప్రజలు భారీ అంచనాలే పెట్టుకునివున్నారు. 
 
ఆదాయపన్ను పరిమితి పెంచుతారని, కర్షకుల సంక్షేమానికి మేలు చేసే పథకాలు ప్రవేశపెడతారని, ఆటోమొబైల్ పరిశ్రమపై జీఎస్టీ తగ్గించి దేశ ఆర్థిక పరిస్థితిని మెరుగుపర్చేలా జనరంజక బడ్జెట్ ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు. మరికొద్ది గంటల్లో నిర్మలాసీతారామన్ ప్రవేశపెట్టనున్న బడ్జెట్ కోసం దేశ ప్రజలంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వూహాన్ నుంచి విముక్తి.. స్వదేశానికి వచ్చిన 324 మంది భారతీయులు