Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దేశ ఆర్థిక మూలాలు పటిష్టంగా ఉన్నాయి : నిర్మలా సీతారామన్

Advertiesment
దేశ ఆర్థిక మూలాలు పటిష్టంగా ఉన్నాయి : నిర్మలా సీతారామన్
, శనివారం, 1 ఫిబ్రవరి 2020 (11:19 IST)
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ 2020-2021 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశపెడుతున్నారు. సరిగ్గా 11 గంటల 03 నిమిషాలకు తన బడ్జెట్ ప్రసంగాన్ని ఆమె ప్రారంభించారు. తన ప్రారంభ ప్రసంగంలో ఇది సామాన్యుల బడ్జెట్ అని ఆమె చెప్పుకొచ్చారు. ఆర్థిక ప్రగతికి సంస్కరణలు అవసరమన్నారు. భారత ఆర్థిక మూలాలు పటిష్టంగా ఉన్నాయని స్పష్టం చేశారు. 
 
ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలోని ప్రభుత్వానికి దేశ ప్రజలు రెండోసారి పట్టంకట్టారనీ, ఆయన సారథ్యంలో దేశంలోని ప్రతి పౌరుడుకు దేశ ఫలాలు అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్టు చెప్పారు. ముఖ్యంగా మోడీ ఆర్థిక విధానాల పట్ల విశ్వసనీయత పెరిగిందన్నారు. 
 
జీఎస్టీ ఒక చారిత్రాత్మకమని, ఈ విషయంలో మాజీ ఆర్థిక మంత్రి దివంగత అరుణ్ జైట్లీ తాను నివాళులు అర్పిస్తున్నట్టు చెప్పారు. ఆయన హయాంలో తీసుకొచ్చిన జీఎస్టీ విధానం వల్ల పన్నుల వసూళ్లు పెరిగాయని, ఫలితంగా దేశ ఆర్థిక స్థితి మెరుగుపడిందన్నారు. దేశంలోని యువతకు ఉపాధి కల్పిస్తామని, పరిపాలనలో సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టినట్టు చెప్పారు. 
 
చిత్తశుద్ధితో ప్రజలకు సేవ చేసేందుకు కట్టుబడివున్నామని, దేశ ప్రజలు ఆదాయం పెంచే దిశగా చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. ఇన్‌స్పెక్టర్ రాజ్‌కు స్వస్తి చెప్పినట్టు చెప్పారు. జీఎస్టీ తగ్గింపుతో ప్రతి కుటుంబ వ్యయం 4 శాతం మేరకు తగ్గిందన్నారు. ఎఫ్‌డీఐలు 284 మిలియన్ డాలర్లకు చేరినట్టు నిర్మలా సీతారామని వెల్లడించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బడ్జెట్ 2020, బంగారం ధరలు ఎలా వున్నాయి?