చికెన్ కేజీ ధర రూ.5 - కేరళలో లక్షలాది కోళ్ళను చంపాలంటూ ఆదేశం

Webdunia
శనివారం, 14 మార్చి 2020 (12:36 IST)
ప్రపంచాన్ని కరోనా వైరస్ కబళించింది. ఇప్పటికే 130 దేశాలకు విస్తరించిన ఈ వైరస్.... ఇప్పటికే వేలాది మందిని హతమార్చింది. లక్షలాది మందికి సోకింది. ముఖ్యంగా మన దేశంలో ఇతర రాష్ట్రాలతో పోల్చితే కేరళలో మాత్రం మరింతగా వస్తరించింది. ఈ రాష్ట్రంలో కేరళలో తీవ్ర అలజడి సృష్టిస్తోంది. 
 
మరోవైపు బర్డ్ ఫ్లూ కేసులు పెరిగిపోతున్నాయి. ఇటీవలే కేరళలోని కొజికోడ్‌లో రెండు కోళ్ల ఫారాల్లో బర్డ్ ఫ్లూ వ్యాధి కనిపించడంతో వాటి ప్రభావిత ప్రాంతాలకు ఒక కిలోమీటరు పరిధిలో అన్ని కోళ్లను చంపేయాలని అధికారులు ఆదేశించడంతో వాటిని చంపేశారు.
 
తాజాగా, ప‌ర‌ప్ప‌ణగ‌డిలో కోళ్లకు బ‌ర్డ్ ఫ్లూ సోకిన‌ట్లు గుర్తించారు. దీంతో ఆ కోళ్ల‌ను కూడా చంపేయాలని ప్ర‌భుత్వం ఆదేశాలు ఇచ్చింది. దీంతో మరోసారి వేలాది కోళ్లు బలి కానున్నాయి. కోళ్ల‌ను చంపేందుకు ప్ర‌భుత్వ అధికారులు ఇప్పటికే ప్రత్యేకంగా సిబ్బందిని ఏర్పాటు చేశారు. 
 
ప‌ర‌ప్ప‌ణగ‌డిలో ఉన్న అన్ని పౌల్ట్రీల్లో వైద్య సిబ్బంది కోళ్లను పరీక్షిస్తున్నారు. బ‌ర్డ్‌ఫ్లూ కేంద్ర బిందువైన ప్రాంతం నుంచి సుమారు కిలోమీటర్ దూరం వ‌ర‌కు ఉన్న అన్ని పౌల్ట్రీల్లో ఉన్న కోళ్ల‌ను చంపేయనున్నారు.
 
మరోవైపు, భారత్ పౌల్ట్రీ రైతులపై కూడా దీని ప్రభావం భారీగానే పడిందని చెప్పాలి. చికెన్ తింటే కరోనా వస్తుందంటూ పుకార్లు సోషల్ మీడియాలో షికారు చేస్తుండటంతో చికెన్ సేల్స్ పూర్తిగా డౌన్ అయిపోయాయి. దీనితో పౌల్ట్రీ రైతులు ఏమి చేయాలో తెలియక దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. 
 
ఈ నేపథ్యంలో కర్ణాటకకు చెందిన ఓ రైతు కరోనా భయంతో చేసిన పని ఇప్పుడు సంచలనంగా మారింది. అంతేకాకుండా సామాజిక మాధ్యమాల్లో దానికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
 
కర్ణాటకలోని గోకక్ తాలూకా లోలాసూర్ గ్రామానికి చెందిన నజీర్ అహ్మద్ అనే రైతు కరోనా వైరస్ వదంతులు కారణంగా చికెన్ సేల్స్ పడిపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురై దాదాపు ఆరు వేల కోళ్లను గుంత తవ్వి సజీవంగా పూడ్చి పెట్టాడు. అనంతరం అతడు మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతం చికెన్ ధర కేజి రూ.5 నుంచి రూ.10 వరకు అమ్ముడవుతోందన్నాడు. 
 
ఇక తాను కోళ్లను పెంచడానికి రూ.6 లక్షలు ఖర్చయిందని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వీటిని నిర్వహించాలంటే తనకు ఖచ్చితంగా నష్టం చేకూరుతుందని ఆవేదన వ్యక్తం చేశాడు. కాగా, అతడు కోళ్లను పూడ్చి పెట్టిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుండగా.. కొందరు అతని చేసిన పనిపై మండిపడుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ ఆంటోని వంద దేవుళ్లు చిత్రం నుంచి మెలోడీ గీతం విడుదల

Faria Abdullah: తరుణ్ భాస్కర్, ఫరియా అబ్దుల్లా గాయపడ సింహం నుంచి బ్రైడ్ సాంగ్

సై ఫై థ్రిల్లర్ మూవీ కిల్లర్ నుంచి డా. పూర్వజ్ ఫస్ట్ లుక్

ఏ మతాన్ని తక్కువ చూపించలేదు : టొవినో థామస్- కెరీర్ లో స్పెషల్ మూవీ: కయదు లోహర్

King 100: నాగార్జున, టబు కాంబినేషన్ లో కింగ్ 100 చిత్రం షూటింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జింజిర్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

ఎడిసన్ టౌన్‌షిప్‌లో నాట్స్ ఆధ్వర్యంలో కాఫీ విత్ కాప్స్: ప్రజా భద్రతపై అవగాహన సదస్సు

రాత్రి నిద్రకు ముందు తినకూడని ఆహార పదార్థాలు ఏమిటి?

టైఫాయిడ్ జ్వరం వచ్చినప్పుడు ఏమేమి తినకూడదు?

అసోసియేషన్ ఆఫ్ హెల్త్‌కేర్ ప్రొవైడర్స్-తమిళనాడు చాప్టర్ భాగస్వామ్యం

తర్వాతి కథనం
Show comments