Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుమార్తెను వ్యభిచార గృహంలోకి నెట్టి తలుపులు వేసిన తల్లి.. ఎక్కడ?

Webdunia
మంగళవారం, 13 నవంబరు 2018 (17:46 IST)
ఆర్థిక స్తోమత సరిగ్గా లేదు. తినడానికి తిండి లేదు. భర్త అనారోగ్యంతో చనిపోయాడు. ఉన్న ఇద్దరు కుమార్తెలను ఎలా పోషించాలో తెలియక ఆలోచనలో పడిపోయిన తల్లి. బంధువుల సహకారం అంతంతమాత్రంగా మారింది. దీంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితిలో పెద్ద కుమార్తెను వ్యభిచార గృహంలోకి నెట్టింది. నెలరోజుల పాటు అయిష్టంగానే వ్యభిచార గృహంలోకి వెళ్ళిన కుమార్తె తల్లితో గొడవ పెట్టుకుంది. దీంతో అసలు విషయం బయటపడింది.
 
నెల్లూరు జిల్లాలోని రాపూరులో నివాసముంటున్న వెంకటేష్‌, కోమలకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తెకు 16 సంవత్సరాలు, చిన్న కుమార్తెకు 11 సంవత్సరాలు. మద్యానికి బానిసైన వెంకటేష్‌ పూటుగా తాగి అపస్మారక స్థితిలోకి వెళ్ళి చనిపోయాడు. దీంతో కుటుంబ భారం మొత్తం తల్లి కోమలపై పడింది. 
 
ఆర్థికంగా ఇబ్బంది పడుతుంటే కోమలను స్థానికంగా ఉన్న ఒక మహిళ ఓ ఉపాయం చెప్పింది. అదే వ్యభిచారం. వ్యభిచార గృహంలోకి మీ అమ్మాయిని పంపితే కావాల్సినంత డబ్బులు వస్తాయని మభ్య పెట్టింది. అలా చేయడం ఇష్టం లేని తల్లి కొన్నిరోజుల పాటు బంధువుల సహాయంతో కుటుంబ పోషణ చూసింది. అయితే రానురాను పరిస్థితి మరింత హీనంగా మారిపోయింది. 
 
దీంతో కుమార్తెను వెంట పెట్టుకుని మార్కెట్‌కు వెళ్లివద్దామని తీసుకెళ్ళి వ్యభిచార గృహంలోకి పంపించి వచ్చేసింది. ఏం జరుగుతుందో తెలియక ఆ యువతి నరకయాతన అనుభవించింది. కుటుంబంలో పడుతున్న బాధను చూసి నెలరోజుల పాటు నరక కూపానికి వెళ్ళింది. అయితే వ్యభిచార గృహంలోకి వచ్చే విటులు నరకం చూపిస్తుండటంతో తట్టుకోలేక తల్లిని ఎదిరించింది. పోలీసులను ఆశ్రయించింది. దీంతో వ్యభిచార గృహాలపై దాడి చేసి నిర్వాహకులను అరెస్టు చేయడంతో పాటు యువతి తల్లిని అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments