సినీ ఇండస్ట్రీలోకి వచ్చే హీరోయిన్లు మాత్రమే కాదు.. వారి తల్లులు కూడా లైంగిక వేధింపులకు గురైనట్టు తెలుస్తోంది. ఇదే విషయంపై బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ తల్లి, సినీ నటి సోనీ రజ్దాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను కూడా అత్యాచారానికి గురైనట్టు తెలిపింది. గతంలో తనకి ఎదురైన అనుభవాలని ఓ ఇంటర్వ్యూలో వివరిస్తూ అందరిని షాక్‌కి గురిచేసింది.
మీటూ ఉద్యమంలో భాగంగా, ప్రస్తుతం పలువురు సెలబ్రిటీలు తమకి ఎదురైన లైంగిక వేధింపుల గురించి బాహటంగా చెబుతున్నారు. తను శ్రీ దత్తా, సోనా మహాపాత్ర, వింటా నందా, సంధ్యా మృదుల్ తదితర మహిళలు లైంగిక వేధింపులకి సంబంధించిన విషయాలని బయటపెట్టగా, తాజాగా అలియా తల్లి సోనీ రజ్ధాన్ తనపై జరిగిన లైంగిక దాడికి సంబంధించిన విషయాలు తెలియజేసింది.
ఇండస్ట్రీలో అడుగుపెట్టినప్పుడు నాకు లైంగిక వేధింపులు ఎదురుకాకపోవడం చాలా అదృష్టంగా ఫీలవుతాను. కానీ సినిమా చిత్రీకరణ సమయంలో ఓ వ్యక్తి నాపై అత్యాచార ప్రయత్నం జరపడం తనను భయబ్రాంతులకి గురిచేసిందని చెప్పారు. అదృష్టం బాగుండడంతో ఆ వ్యక్తి నుండి తప్పించుకున్నట్టు తెలిపారు.
అయితే, అతని పేరును మాత్రం ఇపుడు బయటపెట్టలేనని, అలా చేస్తే అతని కుటుంబానికి బాధ మిగల్చాలనుకోవడం లేదు. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారని చెప్పుకొచ్చింది. ఆ ఘటన జరిగినప్పటి నుంచి అతనితో మాట్లాడమే మానేశాను. తప్పు చేసిన వాడు ఎప్పటికైన శిక్ష అనుభవిస్తాడని తెలిపింది.
అదేసమయంలో మీటూలో భాగంగా బాధిత మహిళలు బయటకి వచ్చి లైంగిక వేధింపుల గురించి చెప్పడం గొప్ప విషయం. కానీ అందరు చెప్పుకోలేరు. వారిని ఎందుకు చెప్పలేదు అని ప్రశ్నించి ఇబ్బంది పెట్టకూడడు అని సోనీ రజ్ధాన్ అన్నారు.