Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అలియా భట్ తల్లిని కూడా వదల్లేదట ఆ నటుడు... ఆయనకు ఇద్దరు పిల్లలు...

అలియా భట్ తల్లిని కూడా వదల్లేదట ఆ నటుడు... ఆయనకు ఇద్దరు పిల్లలు...
, బుధవారం, 24 అక్టోబరు 2018 (15:10 IST)
మీటూ ద్వారా సినీ ఇండస్ట్రీలో ఎంతమంది పేర్లు బయటకు వస్తాయో... ఎంతమంది బాధితులు తమకు ఎదురైన చేదు అనుభవాలను వెలికి తీసుకువస్తారో చెప్పడం సాధ్యమయ్యేట్లు లేదు. ఎందుకంటే రోజుకొకరు తమపై ఫలానా నటుడు లైంగిక దాడి చేసాడంటూ ప్రకటిస్తున్నారు. తాజాగా అలియా భట్ తల్లి, మహేష్ భట్ భార్య అయిన సినీ నటి సోనీ ర‌జ్ధాన్ చేసిన వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.
 
ఇంతకీ ఆమె ఏం చెప్పారంటే... ఇండ‌స్ట్రీలో అడుగుపెట్టిన‌ కొత్తలో తనకు లైంగిక వేధింపులు ఎదురవ్వలేదట. కానీ ఆ తర్వాత ఓ నటుడు ఆమెపై అత్యాచార యత్నం చేశాడట. ఎంతో ప్రయత్నించాడట. చివరికి ఎలాగో అతడి బారి నుంచి తప్పించుకున్నానంటూ చెప్పుకొచ్చింది సోనీ. అతడి పేరు ప్రస్తుతం చెప్పి అతడిని ఇబ్బందులపాలు చేయదలుచుకోలేదన్న సోనీ... ఓ క్లూ మాత్రం ఇచ్చింది. సదరు నటుడికి ఇద్దరు పిల్లలు వున్నారంటూ బాంబు పేల్చింది. మరి ఇద్దరు పిల్లలున్న బాలీవుడ్ బిగ్ స్టార్ ఎవరనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
 
మరో బాలీవుడ్ సెలబ్రిటీ అలోక్ నాథ్ ప్రవర్తన గురించి మాట్లాడుతూ... అతడి చూపే తేడాగా వుంటుందని చెప్పారు. మ‌ద్యం తాగితే ఆయ‌న ఇష్ట‌మొచ్చిన‌ట్టు ప్ర‌వ‌ర్తిస్తాడనీ, హీరోయిన్ల పట్ల అతడి తీరు అస్స‌లు న‌చ్చ‌దంటూ బాంబు పేల్చారు. కాగా ఇప్పటివరకూ త‌నుశ్రీ ద‌త్తా, సోనా మ‌హాపాత్ర‌, వింటానందా, సంధ్యా మృదుల్, కంగనా రనౌత్ తదితర తారలు మీటూ అంటూ ఎన్నో విషయాలను చెప్పారు. తాజాగా ఈ జాబితాలో అలియా భట్ తల్లి కూడా చేరిపోయింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అలా ఇలా వాడుకోలేదు.. మర్మభాగాలను కూడా షూట్ చేశారు.. ఎవరికి చెప్పుకోను...