Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్ళయి నెలరోజులే.. భార్యపై అనుమానంతో ఆ మెడికో..?

Webdunia
మంగళవారం, 4 జూన్ 2019 (20:57 IST)
అతనో మెడికో. తనతో పాటు చదివే అమ్మాయిని ప్రేమించాడు. తనను ప్రేమించమని వెంటపడ్డాడు. పెళ్ళి చేసుకుంటానని చెప్పాడు. తల్లిదండ్రులను ఒప్పించి పెళ్ళి కూడా చేసేసుకున్నాడు. అయితే పెళ్ళయిన తరువాత భార్యపై మోజు తీరింది. కట్నంపై మోజు కలిగింది. అంతే... ఆ పేరుతో ఆమెను చిత్ర హింసలు పెట్టాడు. ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించాడు.
 
గుంటూరు జిల్లాకు చెందిన లక్ష్మి అమలాపురంలో ఎం.బి.బిఎస్ చదువుతోంది. తనతో పాటు చదివే కొత్త సాయిక్రిష్ణ మూడునెలల నుంచి ప్రేమ పేరుతో ఆమె చుట్టూ తిరిగాడు. తనకు ప్రేమ అంటే ఇష్టం లేదని ఆమె చెబుతూ వచ్చింది. అయితే పట్టువదలని విక్రమార్కుడిలా తిరిగాడు. చివరకు తల్లిదండ్రులు వద్దకు వెళ్ళి ఆమెనే పెళ్ళి చేసుకుంటానని చెప్పారు.
 
లక్ష్మి తల్లిదండ్రులు సాయిక్రిష్ణ కుటుంబ సభ్యుల గురించి ఆరా తీశారు. సాయిక్రిష్ణ తండ్రి కొత్తపల్లి సాంబశివరావు నాగార్జున యూనివర్సిటీలో రెక్టార్, తల్లి క్రిష్ణశ్రీ పొగాకు బోర్డులో సభ్యురాలు. వారితో ఎలాగో నచ్చజెప్పి పెళ్ళికి ఒప్పించారు. నెలరోజుల క్రితం ఇద్దరికీ పెళ్ళి చేసేశారు. 15 రోజుల వరకు వీరి జీవితం సాఫీగానే సాగింది. అయితే ఆ తరువాత భార్యపై అనుమానం పెంచుకున్నాడు భర్త. 
 
లక్ష్మిని ఏదో ఒక రకంగా హింసిస్తూ వచ్చాడు. దీంతో మనస్థాపానికి గురైన లక్ష్మి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు. కోలుకొని ఇంటికి వచ్చిన తరువాత సాయిక్రిష్ణపై ఫిర్యాదు చేసింది లక్ష్మి. తనను మానసికంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని, కట్నం పేరుతో హింసిస్తున్నారని ఫిర్యాదు చేసింది లక్ష్మి. ప్రస్తుతం సాయిక్రిష్ణ పరారీలో ఉన్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పొట్టి దుస్తులు అందుకే వేసుకోను.. నిజం చెప్పిన సాయిపల్లవి?

బాలీవుడ్ దర్శకుడు మనోజ్ కుమార్ ఇకలేరు...

మళ్ళీ సినిమాల్లో నటించనున్న కేంద్ర మంత్రి!!

హోం టౌన్ సిరీస్ చూస్తే మీ సొంతూరు గుర్తుకువస్తుంది - రాజీవ్ కనకాల

విడుదలకు సిద్ధమవుతున్న సుమయ రెడ్డి నటించిన డియర్ ఉమ చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments