Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్తే దైవం.. ప్రియుడికి ముఖం చాటేసింది.. వాడేమో పెట్రోల్ పోసి నిప్పంటించాడు..

Webdunia
గురువారం, 28 మార్చి 2019 (18:52 IST)
పెళ్లికి తర్వాత అక్రమ సంబంధం. అయితే ఆమె ప్రియుడిని దూరంగా పెట్టింది. భర్తకు దగ్గరైంది. అయితే ప్రియుడితో వివాహేతర సంబంధానికి నిరాకరించింది. ఇక తన భర్తే దైవమని చెప్పింది. భర్త గొప్పదనాన్ని తెలుసుకుని ప్రియుడితో శృంగారానికి ఒప్పుకోలేదు. అంతే ప్రియుడు ఆగ్రహానికి గురయ్యాడు. కక్ష్య పెంచుకుని.. వివాహేతర సంబంధాన్ని తెంచేసుకున్న వివాహితపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. 
 
ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా ఫరూఖ్‌నగర్ మండలంలోని మహాల్ ఎలికట్ట గ్రామానికి చెందిన జంగం రాములు అనే యువకుడికి, అదే గ్రామానికి చెందిన ఓ మహిళతో పరిచయం ఏర్పడింది. అది కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. వీరిద్దరూ చాలారోజులు శారీరకంగా కలుసుకుంటూ.. షికార్లు కొట్టారు. 
 
అయితే కొన్నాళ్ల క్రితం ఇద్దరి మధ్యా గొడవలు జరిగాయి. గొడవ తర్వాత ప్రియుడికి దూరమైన ఆమె... భర్త ప్రేమకు దగ్గరైంది. తాను చేస్తున్న తప్పును తెలుసుకుని, రాములుతో మాట్లాడడం మానేసింది. కానీ ఆమెతో శారీరక సుఖానికి బాగా అలవాటు పడిన రాములు... ఆమె వెంటపడి కోరిక తీర్చాల్సిందిగా వేధించడం మొదలెట్టాడు. 
 
అయినా ఆమె పట్టించుకోకపోవడంతో పని ముగించుకుని నిర్మానుష్య ప్రాంతంలో ఆమెను ఆపి.. కోరిక తీర్చాలన్నాడు. అందుకు ఆమె నిరాకరించడంతో.. ఆమె ఒంటిపై పెట్రోల్ పోసి నిప్పుపెట్టాడు. 
 
మంటలకు తాళలేక ఆమె కేకలు వేయడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న స్థానికులు... మంటలు ఆర్పి, ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా మారడంతో హైదరాబాద్ ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అయితే ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు రాములు కోసం గాలిస్తున్నారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments