Webdunia - Bharat's app for daily news and videos

Install App

గ్రామ వాలంటీర్ల కోసం పోటెత్తిన ద‌ర‌ఖాస్తులు-9 లక్షలు దాటేశాయి

Webdunia
ఆదివారం, 7 జులై 2019 (13:10 IST)
• 9 లక్షలు దాటిన వాలంటీర్ దరఖాస్తులు
 
• గ్రామ, గిరిజన వాలంటీర్లకు ముగిసిన గడువు 
 
• గ్రామ వాలంటీర్ల కోసం పోటెత్తిన ద‌ర‌ఖాస్తులు
 
• 7.92 లక్షల మంది నుంచి అందిన దరఖాస్తులు 
 
• వీటిలో 3.43 లక్షల దరఖాస్తులు మహిళలవే
 
• వార్డు వాలంటీర్ల దరఖాస్తుకు గడువు ఈ నెల 10వ తేదీ వరకు పొడిగింపు
 
• వార్డు వాలంటరీర్లకు అర్హత ఇంటర్మీడియెట్ కు సడలింపు
 
• పోస్టు గ్రాడ్యుయేట్లూ ద‌ర‌ఖాస్తు
 
• అసంపూర్తి ద‌ర‌ఖాస్తులు సరిదిద్దుకునే సదుపాయం
 
• అభ్య‌ర్థుల‌కు ఆర్టీజీఎస్ సూచ‌న‌లు
 
 
స‌చివాల‌యం: న‌వర‌త్నాల్లో భాగంగా రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టిన గ్రామ, వార్డు వాలంటీర్ల భ‌ర్తీ ప్ర‌క్రియ‌కు భారీ స్థాయిలో స్పంద‌న వ‌చ్చింది. కేవ‌లం 16 రోజుల్లోనే దాదాపు 9  ల‌క్ష‌ల మందికి పైగా అభ్యర్ధులు ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. ముఖ్య‌మంత్రి వై.ఎస్.జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి ఆలోచ‌నావిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మానికి అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తోంది. 
 
గ్రామ, వార్డు వాలంటీర్ పోస్టులకు దరఖాస్తులు పోటెత్తుతున్నాయి. వాలంటీర్ పోస్టుల భ‌ర్తీకి ఇంట‌ర్మీడియెట్ విద్యార్హ‌త‌గా నిర్ణ‌యించిన‌ప్ప‌టికీ.. గ్రాడ్యుయేట్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లు, ప్రొఫెష‌నల్ కోర్సులు చ‌దివిన‌వాళ్లు కూడా దరఖాస్తు చేసుకోవడం కనిపించింది. జూన్ 24వ తేదీ నుంచి ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ చేప‌ట్టిన సంగతి తెలిసిందే. జులై 6వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు ఆన్లైన్ ద్వారా 9 ల‌క్ష‌లకు పైగా ద‌ర‌ఖాస్తులు అందాయి. 
 
అందులో ఇప్పటికే 8,20,476 దరఖాస్తుల పరిశీలన పూర్తికాగా, సక్రమంగా ఉన్న 7,81,899 దరఖాస్తులను ఆమోదించారు. 79,580 లక్షల దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయి. అసంపూర్తిగా ఉన్న 38,577 దరఖాస్తులను తిరస్కరించారు. ఈ అభ్యర్ధులు కూడా గడువు తేదీలోపు తమ దరఖాస్తులు పొరపాట్లను సరిచేసుకుని, తిరిగి దరఖాస్తు చేసుకునే సదుపాయాన్ని ప్రభుత్వం కల్పిస్తోంది. ఈ మేరకు రియల్ గవర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్) అభ్యర్ధులకు సూచన చేసింది.  
 
గ్రామ వాలంటీర్ వైబ్‌సైట్‌ను ఆర్టీజీఎస్ రూపొందించి, నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. వైబ్‌సైట్‌కు అంతర్జాలంలో నెటిజెన్ల నుంచి విశేష స్పందన కనిపిస్తోంది. ఇప్పటి వరకు గ్రామ, వార్డు వాలంటీర్ల కోసం 24 లక్షల మందికి పైగా నెటిజన్లు వైబ్‌సైట్‌ను సందర్శించారు. 
గ్రామ వాలంటీర్లకు 7.92 లక్షల దరఖాస్తులు 
గ్రామ వాలంటీర్లకు దరఖాస్తు చేసుకోవడానికి నిర్ణయించిన గడువు జూలై 5వ తేదీతో ముగిసింది.
 
ఈ కొలువుల కోసం మొత్తం 7,92,193 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీటిలో గ్రామీణ ప్రాంతాల నుంచి 7,49,878 మంది, గిరిజన ప్రాంతాల నుంచి 42,515 మంది దరఖాస్తు చేసుకున్నారు. 
 
ఉన్న‌త విద్యావంతుల నుంచి వేలల్లో దరఖాస్తులు 
గ్రామ, వార్డు వాలంటీర్ పోస్టుల‌ కోసం ఉన్నత విద్యావంతులు సైతం పోటీ పడుతున్నారు.
 
పోస్టు గ్రాడ్యుయేట్లు కూడా ఈ కొలువు కోసం పెద్ద సంఖ్యలో దరఖాస్తు చేసుకున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 15,183, పట్టణ ప్రాంతాల్లో 6,532 గిరిజన ప్రాంతాల్లో 272 పోస్టు గ్రాడ్యుయేట్లు దరఖాస్తు చేసుకున్నారు. పట్టభద్రుల నుంచి కూడా భారీగానే దరఖాస్తులు అందుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో 2,08,410, గిరిజన ప్రాంతాల్లో 7,160 మంది పట్టభద్రులు ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకున్నారు.
 
 
మహిళల నుంచి అనూహ్య స్పందన 
గ్రామ, వార్డు వాలంటీర్ల కోసం మహిళా అభ్యర్ధుల నుంచి లక్షల సంఖ్యలో దరఖాస్తులు అందుతున్నాయి. ఇప్పటి వరకు ఈ కొలువుల కోసం మొత్తం 4,02,245 మంది మహిళలు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో గ్రామీణ ప్రాంతాల నుంచి దరఖాస్తు చేసుకున్నవారు 3, 25,852 మంది, పట్టణ ప్రాంతాల నుంచి 58,503 గిరిజన ప్రాంతాల నుంచి 17,890 మంది దరఖాస్తులు పంపుకున్నారు. 
 
 
విద్యార్హతల్లో సడలింపు
గ్రామ వార్డు వాలంటీర్ల నియామకాలకు సంబంధించి అర్హతల విషయంలో ప్రభుత్వం తాజాగా సడలింపులు ఇచ్చింది.  పట్టణ ప్రాంతాల్లో వార్డు వాలంటీర్ల కోసం గతంలో విద్యార్హత డిగ్రీగా నిర్ణయించారు. దాన్ని ఇప్పుడు ఇంటర్మీడియెట్ కు తగ్గించారు. 
గడువు పొడిగింపు
వార్డు  వాలంటీర్లకు దరఖాస్తు చేసుకోవడానికి కూడా  ప్రభుత్వం తుది గడువును పొడిగించింది. 
 
ఈ నెల 5వ తేదీ దరఖాస్తులకు చివరి గడువుగా ముందుగా నిర్ణయించింది. అయితే వార్డు వాలంటర్లీకు విద్యార్హత డిగ్రీ నుంచి ఇంటర్మీడియెట్కు సడలించిన నేపథ్యంలో వారు దరఖాస్తు చేసుకోవడానికి తుది గడువును కూడా ప్రభుత్వం  ఈ నెల 10వ తేదీ వరకు పొడిగించింది. 
పొర‌పాట్లు దిద్దుకోండిలా.. 
అసంపూర్తి ద‌ర‌ఖాస్తుల వ‌ల్ల తిర‌స్క‌ర‌ణ‌కు గురైన అభ్య‌ర్థులు తిరిగి త‌మ ద‌ర‌ఖాస్తుల‌ను స‌రిగ్గా నింపి ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. 
వెబ్‌సైట్‌లో వారు లాగిన్‌లోకి వెళ్లి ద‌ర‌ఖాస్తులో అడిగిన వివ‌రాల‌ను స‌రిగ్గా పొందుప‌రచామా లేదా అన్న‌ది స‌రి చూసుకుని, అన్ని ప‌త్రాలు స‌రిగ్గా అప్‌లోడు చేసుకోవాల‌ని ఆర్టీజీఎస్ సూచించింది.  ద‌ర‌ఖాస్తుకు చివ‌రి గ‌డువులోపే వాటిని స‌రి చేసుకుని అప్‌లోడు చేయాలి.  ఇలాంటి అభ్య‌ర్థులు ఈ కింది లింక్‌ల‌ను చూసుకుని త‌మ ద‌ర‌ఖాస్తుల‌ను స‌రిగ్గా నింపి, అన్ని ధృవీక‌ర‌ణ ప‌త్రాల‌ను మ‌ళ్లీ అప్‌లోడు చేసి ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. 
 
అప్లికేషన్ స్టేటస్ కొరకు http://bit.ly/Checkapplicationstatus యూజర్ మాన్యువ‌ల్‌ కొరకు http://bit.ly/Howtoeditrejectedapplicants .   గ్రామ‌ వాలంటీర్  కోసం http://gramavolunteer.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.
 
 
జారీ చేసిన‌వారు:  రియ‌ల్ టైమ్ గ‌వ‌ర్నెన్స్ సొసైటీ, స‌చివాల‌యం, అమ‌రావ‌తి
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అత్తారింటికి దారేది చిత్రంలో అత్త లాంటి పాత్రలు చేస్తా: మాజీమంత్రి రోజా

సీరియస్ పాయింట్ సిల్లీగా చెప్పిన మెకానిక్ రాకీ -రివ్యూ

గుర్రం పని గుర్రం చేయాలి.. గాడిద పని గాడిద చేయాలి : పోసాని - వర్మలకు ఈ సామెత తెలియదా?

ఒకే చోటు ప్రత్యక్షమైన ధనుష్ - నయనతార - ముఖాలు చూసుకోని హీరోహీరోయిన్లు

ఇడ్లీ కడై నిర్మాతకు పెళ్లి.. ఒకే వేదికపై నయన, ధనుష్.. మాట్లాడుకున్నారా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

రక్తవృద్ధికి తోడ్పడే ఖర్జూరాలు

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండటానికి 8 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments