Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

6 ల‌క్ష‌లు దాటిన గ్రామ వాలంటీర్ ద‌ర‌ఖాస్తులు... 2 ల‌క్ష‌ల‌కు పైగా మ‌హిళా అభ్య‌ర్థులు

6 ల‌క్ష‌లు దాటిన గ్రామ వాలంటీర్ ద‌ర‌ఖాస్తులు... 2 ల‌క్ష‌ల‌కు పైగా మ‌హిళా అభ్య‌ర్థులు
, బుధవారం, 3 జులై 2019 (21:08 IST)
రాష్ట్ర ప్ర‌భుత్వ న‌వ‌ర‌త్న ప‌థ‌కాల్లో ఒక‌టైన వాలంటీర్‌ల‌కు ప్ర‌జ‌ల నుంచి అనూహ్య స్పంద‌న ల‌భిస్తోంది. ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి వినూత్న ఆలోచ‌నావిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మం గ్రామ వాలంటీర్ అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది.

గ్రామ వాలంటీర్ నియామ‌కాల కోసం ప్ర‌భుత్వం ఇటీవ‌లే నోటిఫికేష‌న్ జారీ చేసిన సంగ‌తి తెలిసిందే. గ్రామ వాలంటీర్ నియామ‌కాల‌ కోసం అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు అనూహ్య సంఖ్య‌లో వ‌స్తున్నాయి. 
 
కేవ‌లం 8 రోజుల వ్య‌వ‌ధిలోనే ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తులు ప్రస్తుతం 6 ల‌క్ష‌లు దాటిపోయాయి. కాగా మంగ‌ళ‌వారం సాయంత్రం ద‌ర‌ఖాస్తుల సంఖ్య 5,48,029కి చేరింద‌ని రియ‌ల్ టైమ్ గ‌వ‌ర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్‌) తెలిపింది.  గ్రామ వాలంటీర్ కోసం ద‌ర‌ఖాస్తు చేస‌కోవ‌డానికి చివ‌రి గ‌డువు ఈ నెల 5వ తేదీ అర్థ‌రాత్రి 12 గంట‌ల వ‌ర‌కు స‌మ‌యం ఉంది. దాంతో ఈ ద‌ర‌ఖాస్తుల సంఖ్య మరింత‌గా పెరిగే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి.
 
రోజుకు సాలీనా 60 వేల‌కుపైగా ద‌ర‌ఖాస్తులు వ‌స్తున్నాయి. ఈ కొలువుల భ‌ర్తీ కోసం గ్రామ వాలంటీర్ వెబ్‌సైట్‌ను ఆర్టీజీఎస్ రూపొందించింది.  గ్రామ వాలంటీర్ కోసం అభ్య‌ర్థులు ఆన్‌లైన్‌లో సుల‌భంగా ద‌ర‌ఖాస్తు చేసుకునే సదుపాయాన్ని ప్ర‌భుత్వం క‌ల్పించింది. ఈ వెబ్‌సైట్‌కు నెటిజ‌న్ల నుంచి కూడా అనూహ్య స్పంద‌న వ‌చ్చింది. ఇప్ప‌టివ‌ర‌కు ఈ వెబ్‌సైట్‌ను తిలకించిన వారి సంఖ్య 16 ల‌క్ష‌లు దాటింది. పోస్టు గ్రాడ్యుయేట్లు సైతం... గ్రామ వాలంటీర్ పోస్టుల‌కు పోటీ ప‌డుతున్నారు.
 
ఇప్ప‌టి వ‌ర‌కు గ్రామీణ ప్రాంతాల్లో గ్రామ వాలంటీర్ కోసం 10,589 మంది,  ట్రైబ‌ల్ ప్రాంతాల్లో 194, ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో 4347 మంది పోస్టు గ్రాడ్యుయేట్ ప‌ట్ట‌భ‌ద్రులు ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు వ‌చ్చిన మొత్తం 5 ల‌క్ష‌ల‌కు పైగా ద‌ర‌ఖాస్తుల్లో మ‌హిళా అభ్య‌ర్థులు కూడా భారీ సంఖ్యలోనే ఉన్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు 2.30 ల‌క్ష‌ల మందికి పైగా మ‌హిళ‌లు ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తులు కొన్ని అసంపూర్తిగా పూరించ‌డం లాంటి త‌ప్పిదాల వ‌ల్ల స్వ‌ల్ప సంఖ్య‌లో ద‌ర‌ఖాస్తులు తిర‌స్క‌ర‌ణ‌కు గుర‌వుతున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు ఇలా కేవలం 28 వేల‌కు పైగా ద‌ర‌ఖాస్తులు మాత్ర‌మే తిర‌స్క‌ర‌ణ‌కు గుర‌య్యాయి. 
 
స‌రిచేసి ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు
అసంపూర్తి ద‌ర‌ఖాస్తుల వ‌ల్ల తిర‌స్క‌ర‌ణ‌కు గురైన అభ్య‌ర్థులు తిరిగి త‌మ ద‌ర‌ఖాస్తుల‌ను స‌రిగ్గా నింపి ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. వెబ్‌సైట్‌లో వారు లాగిన్‌లోకి వెళ్లి ద‌ర‌ఖాస్తులో అడిగిన వివ‌రాల‌ను స‌రిగ్గా పొందుప‌రచామా లేదా అన్న‌ది స‌రి చూసుకుని, అన్ని ప‌త్రాలు స‌రిగ్గా అప్‌లోడు చేసుకోవాల‌ని ఆర్టీజీఎస్ సూచించింది.
 
ద‌ర‌ఖాస్తుకు చివ‌రి గ‌డువులోపే వాటిని స‌రిచేసుకుని అప్‌లోడు చేయాలి. ఇలాంటి అభ్య‌ర్థులు ఈ కింది లింక్‌ల‌ను చూసుకుని త‌మ ద‌ర‌ఖాస్తుల‌ను స‌రిగ్గా నింపి, అన్ని ధృవీక‌ర‌ణ ప‌త్రాల‌ను మ‌ళ్లీ అప్‌లోడు చేసి ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. అప్లికేషన్ స్టేటస్ కొరకు http://bit.ly/Checkapplicationstatus యూజర్ మాన్యువ‌ల్‌ కొరకు http://bit.ly/Howtoeditrejectedapplicants గ్రామ‌ వాలంటీర్  కోసం http://gramavolunteer.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మందబలంతో తప్పుడు కేసులు పెట్టి వేధించారు: కాంగ్రెస్‌పై విజయసాయిరెడ్డి ఫైర్