Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒక్క ఛాన్స్ పవన్‌కు ఇస్తే.. మార్పేమిటో చూపిస్తారు : మాయావతి(Video)

Webdunia
బుధవారం, 3 ఏప్రియల్ 2019 (14:03 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభకు జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌కు ఒక్క ఛాన్స్ ఇవ్వాలని ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బీఎస్పీ అధినేత్రి మాయావతి రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఒకే ఒక్క ఛాన్స్ పవన్‌కు ఇస్తే.. మార్పంటే ఏంటో చేసి చూపిస్తాడని ఆమె చెప్పుకొచ్చారు. 
 
జనసేన పార్టీ - బీజేపీ కూటమి తరపున పోటీ చేస్తున్న అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేసేందుకు ఆమె వైజాగ్ వచ్చారు. పనిలో పనిగా విలేకరులతో ముచ్చటించారు. ఏపీలో పరిపాలన, ప్రతిపక్షాల గురించి విమర్శించారు. పొత్తులో భాగంగా జనసేన పార్టీ విధానాలు, పవన్ కల్యాణ్ సిద్ధాంతాలను కీర్తించారు. ఒకే ఒక్క ఛాన్స్.. పవన్ కల్యాణ్ కు ఇస్తే.. మార్పు ఏంటో చూపిస్తాడని భరోసా ఇచ్చారు. 
 
టీడీపీ, వైకాపాలను నమ్మొద్దని సూచించారు. ఉమ్మడి ఏపీని కాంగ్రెస్ అభివృద్ధి చేయలేదన్న విషయాన్ని గుర్తు చేశారు. విభజన తర్వాత ఏపీకి అన్యాయం జరిగిందని... ప్రత్యేక హోదాపై బీజేపీ మోసం చేసిందంటూ ఆవేదన వ్యక్తం చేశారామె. ఏపీ ప్రజలు చంద్రబాబు, జగన్ వలలో పడొద్దని పిలుపునిచ్చారు. ప్రజలు కొత్త నాయకత్వాన్ని ఆదరించాలని మాయావతి కోరారు.
 
ఏపీలో జనసేన, బీఎస్పీ, వామపక్షాలు కలిసి పనిచేస్తున్నాయని.. అన్ని పార్టీ కార్యకర్తలు, నేతల సమన్వయంతో ముందుకు వెళ్లాలని సూచించారు. జనసేన, బీఎస్పీ పార్టీలు తక్కువ చెప్పి.. ఎక్కువ పనులు చేస్తాయన్నారు. సమాజంలోని ప్రతి సమస్యను పరిష్కరించేందుకు పని చేస్తామని హామీ ఇచ్చారామె. పవన్ కళ్యాణ్‌కు యూత్ ఫాలోయింగ్ చాలా బాగుందని.. పవన్ కూటమిదే విజయమని ధీమా వ్యక్తం చేశారామె. పవన్ సీఎం అవుతారని విశ్వాసం ఉందంటూ మాయావతి జోస్యం చెప్పారు. వీడియో చూడండి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయాను : హాస్యనటుడు స్వాతి సచ్‌దేవా

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments