Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎక్కువగా నీళ్లల్లో పనిచేస్తున్నారా ? ఈ చిట్కాలు పాటిస్తే?

మిగిలిన శరీరంతో పోలిస్తే అరచేతులు, అరికాళ్లు చర్మం వేరుగా ఉంటాయి. అదేపనిగా నీళ్లలో ఉండడం వలన ఇన్‌ఫెక్షన్స్ వస్తుంటాయి. ఇలాంటి సమస్యల నుండి విముక్తి చెందేందుకు ఈ చిట్కాలు పాటిస్తే మంచి ఫలితాలను పొందవచ్చును. నీళ్లల్లో ఎక్కువగా పనిచేసేవారిలో పాదాలు, అరి

Webdunia
గురువారం, 9 ఆగస్టు 2018 (15:15 IST)
మిగిలిన శరీరంతో పోలిస్తే అరచేతులు, అరికాళ్లు చర్మం వేరుగా ఉంటాయి. అదేపనిగా నీళ్లలో ఉండడం వలన ఇన్‌ఫెక్షన్స్ వస్తుంటాయి. ఇలాంటి సమస్యల నుండి విముక్తి చెందేందుకు ఈ చిట్కాలు పాటిస్తే మంచి ఫలితాలను పొందవచ్చును. నీళ్లల్లో ఎక్కువగా పనిచేసేవారిలో పాదాలు, అరిచేతుల్లో పాచిపట్టినట్లుంటాయి.
 
కొన్నిసార్లు చర్మం పగిలినట్లవుతుంది. ఆ పగుళ్ల నుండి రక్తం కారడం, చీము పట్టడం వంటి సమస్యలు ఎదురవుతుంటాయి. బురద, వాననీళ్లలో నడవడం, తరచుగా డిటర్జెంట్ సబ్బు, వాషింగ్ సోడా వంటివి వాడడం వలన చేతులు పొడిబారినట్లవుతాయి. వీటి వలన చాలామందికి అరచేతుల్లో పొక్కుల్లాంటివి వస్తుంటాయి. 
 
ఇలాంటి వారు ఆహారంలో వాతం, పిత్తం పెరిగే పదార్థాలను తగ్గించుకోవాలి. ముఖ్యంగా కారం, మసాలాలు, జీర్ణం కాని ఆహారానికి దూరంగా ఉండాలి. నీళ్లలో పనిచేసిన తరువాత వెంటనే పాదాలు, చేతుల్ని గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఆ తరువాత మెత్తని వస్త్రంతో తడి లేకుండా తుడుచుకుని పాదాలకు ఆముదం లేదా నువ్వుల నూనెతో మర్దనా చేసుకావాలి. 
 
వేపాకులను నీళ్లలో మరిగించుకుని ఆ నీళ్ల తగినంత వేడిగా ఉన్నప్పుడే పాదాలను 10 నిమిషాల పాటు ఆ నీటిలో ఉంచాలి. ఆ తరువాత పొడి వస్త్రంతో తుడుచుకుని నువ్వుల నూనె లేదా కొబ్బరి నూనెను రాసుకోవాలి. మాని పసుపును నీళ్లలో కలిపి కషాయంగా కాచుకుని మూడు చెంచాల పాటు రెండుపూటలా తీసుకోవాలి. ఇలా చేయడం వలన ఇన్‌ఫెక్షన్స్ నుండి ఉపశమనం లభిస్తుంది. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments