Webdunia - Bharat's app for daily news and videos

Install App

నట్స్ పౌడర్‌తో బెల్లం కుడుములు ఎలా చేయాలి? (video)

Webdunia
సోమవారం, 24 జులై 2023 (18:53 IST)
Kudumulu
కుడుములు అంటే అందరికీ చాలా ఇష్టం. కుడుములను మోదకాలుగా వినాయకుడికి సమర్పిస్తూ వుంటాం. అలాంటి కుడుములను బెల్లం, బియ్యం పిండితో తయారు చేస్తుంటాం. వీటిలో కొబ్బరి మనకు ఇష్టమైన పదార్థాలను కలిపి చేస్తుంటాం. అలా బెల్లం కుడుములను పోషకాలతో కూడిన నట్స్ పౌడర్‌తో చేస్తే ఎలా వుంటుందో చూద్దాం.. నట్స్ ఆరోగ్యానికి వ్యాధినిరోధక శక్తిని ఇస్తాయి. 
 
నరాలను బలోపేతం చేస్తాయి. నట్స్‌లో గుండె ఆరోగ్యకరమైన పోషకాలు చాలా పుష్కలంగా ఉన్నాయి. ఫైబర్ శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. గింజలలో తక్కువ సోడియం, అధిక పొటాషియం స్థాయిలు ఆరోగ్యకరమైన రక్తపోటును నిర్వహించడానికి సహాయపడతాయి.
 
అలాంటి నట్స్‌తో కుడుములను ఎలా చేయోలో చూద్దాం
కావలసిన పదార్థాలు:
నట్స్ పౌడర్- అరకప్పు 
కొబ్బరి తురుము - ఒక కప్పు 
బియ్యం పిండి - అర కిలో 
బెల్లం - అర కిలో 
ఉప్పు - చిటికెడు 
 
తయారీ విధానం :
ముందుగా బియ్యం పిండిని ఇడ్లీ పాత్రలో 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. తర్వాత బెల్లంను పాకం పట్టుకోవాలి. కొబ్బరిని తురుముకోవాలి. యాలకుల పొడిని చేసుకోవాలి. వేయించిన నట్స్‌ను సిద్ధం చేసుకోవాలి. నట్స్‌ను పొడి చేసుకోవాలి. తర్వాత ఉడికించిన బియ్యం పిండిలో చిటికెడు ఉప్పును చేర్చి బాగా కలుపుకోవాలి. ఆపై బెల్లం పాకంను వడకట్టి రుచికి తగినంత చేర్చుకోవాలి. వీటిని బాగా మిక్స్ చేసి అందులో కొబ్బరి తురుము, నట్స్ పౌడర్, యాలకుల పొడి చేర్చి బాగా కుడుముల పిండిలా సిద్ధం చేసుకోవాలి. వాటిని కుడుముల్లా చేసుకుని.. ఇడ్లీ పాత్రలో  వుంచి తిరిగి 15 నిమిషాల పాటు ఉడికించుకుంటే కుడుములు రెడీ. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

హైదరాబాద్‌లో దంచికొట్టిన వర్షం ... పిడుగుపాటుకు ఇద్దరు మృతి (Video)

వివేకా కుమార్తె సునీతను ఏమైనా చేస్తారనే భయం ఉంది : వైఎస్ షర్మిల

బోయ్ ఫ్రెండ్ కౌగిలించుకోలేదని 14 అంతస్తుల కాలేజీ భవనం పైనుంచి దూకేసిన యువతి

అమరావతికి శుభవార్త చెప్పిన ప్రపంచ బ్యాంక్ - తొలి విడతగా రూ.3535 కోట్లు రిలీజ్

జాతీయ ఉపాధి హామీ పథకం లబ్దిదారుల జాబితాలో షమీ సోదరి పేరు!!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ సినిమాల్లో నటించనున్న కేంద్ర మంత్రి!!

హోం టౌన్ సిరీస్ చూస్తే మీ సొంతూరు గుర్తుకువస్తుంది - రాజీవ్ కనకాల

విడుదలకు సిద్ధమవుతున్న సుమయ రెడ్డి నటించిన డియర్ ఉమ చిత్రం

హన్సికపై గృహహింస కేసు ... కొట్టివేయాలంటూ హైకోర్టులో పిటిషన్

అఖండ 2 తాండవంలో శివతత్త్వం చెబుతున్న బోయపాటి

తర్వాతి కథనం
Show comments