Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కుంకుడు కాయతో కొత్త వెంట్రుకలు మొలుస్తాయి, ఎలాగో తెలుసా?

soap nuts
, బుధవారం, 1 మార్చి 2023 (22:43 IST)
కుంకుడు కాయ. ఇది తలస్నానానికి ఉపయోగిస్తారు. కానీ ఈరోజుల్లో షాంపూలు వచ్చాక వాటిని ఉపయోగించేవారు తక్కువయ్యారు. ఈ కుంకుడు కాయలతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అవేమిటో తెలుసుకుందాము. కుంకుడు కాయల గుజ్జు చేదుగా వుండి శ్లేష్మంతో కూడిన వాంతిని కలిగించి ఉబ్బసాన్ని తగ్గిస్తుంది. కేశ సంపదను వృద్ధి చేసుకునేందుకు కుంకుడు కాయలు ఎంతో ఉపయోగపడతాయి.
 
కుంకుడుకాయ పైపెచ్చు వేడినీటిలో వేసి నలిపి వడబోసి ఆ నీటిని 2 చుక్కలు ముక్కులో వేస్తే మూర్ఛ నుంచి కోలుకుంటారు. కుంకుడు కాయలు నలగగొట్టి బట్టలో వేసి తలకు కట్టుకుంటే వాతం తగ్గి తలనొప్పి పోతుంది. కాస్త నీటిలో కల్లుప్పు కరిగించి ఆ నీటిని సానపై వేసి కుంకుడు కాయను ఆ నీటిలో అరగదీసి వచ్చిన గంధాన్ని పేనుకొరికిన చోట పట్టిస్తే వెంట్రుకలు మొలుస్తాయి.

కుంకుడుకాయ గింజలను పగులగొట్టి వచ్చే పప్పును పొడిచేసి మూడు చిటికెల పొడిలో తేనె కలిపి తీసుకుంటే ఉబ్బసం తగ్గిపోతుంది. కుంకుడుకాయలను సానపై అరగదీసి ఆ గంధాన్ని గొంతుకు రాసుకుంటే ఎక్కిళ్లు తగ్గిపోతాయి. తలలో చుండ్రును తరిమి తరిమి కొట్టాలంటే కుంకుడుకాయలతో తలస్నానం చేయాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హైదరాబాద్‌లో నూతన రీజనల్‌ రెఫరెన్స్‌ ల్యాబ్‌: దక్షిణాదిలో లుపిన్‌ డయాగ్నోస్టిక్స్‌ కార్యకలాపాలు