Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పెరుగులో ఎండుద్రాక్ష వేసి మరుసటి రోజు ఆరగిస్తే...

curd with kismis
, మంగళవారం, 21 ఫిబ్రవరి 2023 (13:24 IST)
ప్రతి ఒక్కరికీ భోజనంలో పెరుగుతినే అలవాటు ఉంటుంది. అలాగే, ఎండు ద్రాక్షను కూడా చాలా మంది ఇష్టపడుతుంటారు. అయితే, పెరుగులో ఎండుద్రాక్షను వేసి మరుసటి రోజు ఆరగిస్తే ఆరోగ్యానికి ఎంతో మేలని పౌషకాహార నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
 
గోరు వెచ్చని పాలను పెరుగుతో తోడు పెట్టే సమయంలోనే పాలలో ఒక టీ స్పూన్ ఎండుద్రాక్ష వేస్తే, మరుసటి రోజుకు ఎండుద్రాక్ష పెరుగు సిద్ధమవుతుంది. దీన్ని మధ్యాహ్న భోజనం తర్వాత లేదా సాయంత్రం స్నాక్‌గా తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని వారు చెబుతున్నారు. అవేంటో ఓసారి తెలుసుకుందాం.
 
ఇలా తయారయ్యే పెరుగులో ప్రోబయాటిక్, ఎండుద్రాక్ష ప్రిబయాటిక్.. ఈ రెండింటి అరుదైన సమ్మేళనం అమోఘమైన ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. పెరుగు పేగుల్లో ఆరోగ్యకరమైన బ్యాక్టీరియాను పెంచుతుంది. ఈ బ్యాక్టీరియాకు అవసరమైన ఆహారాన్ని ఎండుద్రాక్షలోని పీచు
సమకూరుస్తుంది.
 
ఈ రెండింటి సమ్మేళనం వల్ల కడుపు ఉబ్బరం, అజీర్తి, యుటిఐ, కొలెస్ట్రాల్, అకారణంగా బరువు పెరగడం, థైరాయిడ్, పిసిఒడిల నుంచి ఉపశమనం దక్కుతుంది. పెరుగుతో బరువు పెరుగుతామనేది అపోహ. ప్రతి రోజూ ఇలా ఎండుద్రాక్షలతో తయారుచేసుకున్న పెరుగును తినడం వల్ల బరువు తగ్గుతారని చెబుతున్నారు. పెరుగు కోసం ఉపయోగించే పాలు వెన్న తీయని పాలై ఉంటే మరీ మంచిదిగా ఉంటుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అధిక బరువుకు కారణమయ్యే ఉదయపు అలవాట్లు ఏంటి?