Webdunia - Bharat's app for daily news and videos

Install App

పొద్దు తిరుగుడు విత్తనాలు.. స్ట్రోక్ ప్రమాదం తగ్గుతుందట!

Webdunia
సోమవారం, 24 జులై 2023 (15:25 IST)
sunflower
పొద్దు తిరుగుడు విత్తనాలు అత్యంత పోషకమైన విత్తనాలలో ఒకటి. వాటిలో ఆరోగ్యకరమైన కొవ్వులు, శరీరానికి అవసరమైన అనేక విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. పొద్దు తిరుగుడు పువ్వులు సాధారణంగా రెండు రకాలు. ఒకటి నూనె కోసం, మరొకటి విత్తనాల కోసం సాగు చేస్తారు. 
 
ముఖ్యంగా పొద్దు తిరుగుడు విత్తనాలు వ్యాధిని నివారించడానికి, పోరాడటానికి సహాయపడతాయి. అనేక ముఖ్యమైన విటమిన్లు, ఖనిజాల మంచి మూలం. పొద్దుతిరుగుడు గింజల్లోని సెలీనియం ఇన్‌ఫ్లమేషన్, ఇన్‌ఫెక్షన్‌తో పోరాడడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. 
 
విత్తనాలలో విటమిన్ ఇ, జింక్, సెలీనియం పుష్కలంగా ఉన్నాయి. ఈ పోషకాలు కణాలకు ఫ్రీ రాడికల్ నష్టం నుండి శరీరాన్ని రక్షిస్తాయి. ఈ గింజలు రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా దీర్ఘకాలిక వ్యాధులను నివారిస్తాయి.
 
పొద్దు తిరుగుడు విత్తనాలలో రక్తనాళాల సంకోచానికి కారణమయ్యే ఎంజైమ్‌లను నాశనం చేసే సమ్మేళనం ఉంటుంది. ఇది రక్త నాళాలను సడలించడం వల్ల రక్తపోటు, స్ట్రోక్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. విత్తనాల్లోని మెగ్నీషియం ధమనుల గోడలపై రక్తపోటును నివారిస్తుంది.
 
ప్రతిరోజూ కొన్ని పొద్దు తిరుగుడు గింజలను తినడం వల్ల ఆరు నెలల్లో రక్తంలో చక్కెర స్థాయిలను 10 శాతం తగ్గించవచ్చు. ఈ విత్తనాలు రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతాయని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.

సంబంధిత వార్తలు

ఏపీలో పోలింగ్ ప్రారంభం.. ఓటేసిన చంద్రబాబు, జగన్, లోకేశ్ దంపతులు

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

తర్వాతి కథనం
Show comments