Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెుక్కజొన్న పులావ్ తయారీ విధానం...

కావలసిన పదార్థాలు: ఉల్లి పాయలు - 4 టమోటాలు - 2 వెల్లుల్లి రెబ్బలు - 4 అల్లం - చిన్న ముక్క గరంమసాలా పొడి - 1 స్పూన్ కారం - 2 స్పూన్స్ ధనియాలు పొడి - 1 స్పూన్ పచ్చిమిర్చి - 2 బాస్‌మతి రైస్ - 1 కప్పు మెు

Webdunia
శుక్రవారం, 21 సెప్టెంబరు 2018 (13:24 IST)
కావలసిన పదార్థాలు:
ఉల్లి పాయలు - 4
టమోటాలు - 2
వెల్లుల్లి రెబ్బలు - 4
అల్లం - చిన్న ముక్క
గరంమసాలా పొడి - 1 స్పూన్
కారం - 2 స్పూన్స్
ధనియాలు పొడి - 1 స్పూన్
పచ్చిమిర్చి - 2
బాస్‌మతి రైస్ - 1 కప్పు
మెుక్కజొన్న గింజలు - 1 కప్పు
బఠాణీలు - పావుకప్పు
యాలకులు - 4 
జీడిపప్పు - కొద్దిగా
దాల్చిన చెక్క - చిన్న ముక్క
లవంగాలు - కొన్ని
కుంకుమపువ్వు - కొద్దిగా 
కొత్తిమీర - కొద్దిగా 
పాలు - 1 స్పూన్
నెయ్యి - తగినంత
ఉప్పు - సరిపడా
 
తయారీ విధానం:
ముందుగా మసాలా దినుసులను మెత్తగా రుబ్బుకోవాలి. ఇప్పుడు పాలలో కుంకుమ పువ్వు వేసి పది నిమిషాలు నాననివ్వాలి. బియ్యం శుభ్రంగా కడుక్కుని అరగంట పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్‌లో నెయ్యి వేసి కాగిన తరువాత యాలకులు, లవంగాలు, దాల్చినచెక్క, జీడిపప్పు వేసి వేయించుకుని ఉల్లిపాయలు వేసి వేగిన తరువాత ముందుగా తయారుచేసుకున్న మసాలా, మెుక్కజొన్న గింజలను వేసి కొద్దిసేపు వేయించుకుని బియ్యం ఈ మిశ్రమంలో వేసుకోవాలి. కప్పు బియ్యానికి రెండుకప్పుల నీరు పోసి కుక్కర్‌లో రెండు లేదా మూడు విజిల్స్‌ వచ్చే వరకుంచి దించేయాలి. అంతే... వేడివేడి మెుక్కజొన్న పులావ్ రెడీ. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

రోడ్డుపై వెళ్తున్న వ్యక్తిపై గాడిద దాడి.. కాలికి తీవ్రగాయం వీడియో వైరల్

నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం... ఆ రెండు పోర్టులకు ప్రమాద హెచ్చరికలు

పోర్టులోకి రైస్ ఎలా వస్తుంది? డిప్యూటీ సీఎం అయిన నాకే సహకారం లేదు: పవన్ విస్మయం (video)

వైనాట్ 175 అన్నారు.. చివరకు 11 వచ్చాయి.. అయినా మార్పు రాలేదు : జగన్‌పై బాలినేని ఫైర్

ఎల్లో మీడియా రాళ్లేస్తోంది.. 48 గంటలే టైమ్... జగన్ లుక్‌పై నెట్టింట చర్చ? (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏఆర్ రెహ్మాన్-సైరా విడాకులు రద్దు అవుతుందా? సైరా లాయర్ ఏమన్నారు?

సమంత ఇంట్లో విషాదం... 'మనం మళ్లీ కలిసే వరకు, నాన్న' ...

నాగ చైతన్య- శోభితా ధూళిపాళ వివాహం.. ఇద్దరి మధ్య ఏజ్ గ్యాపెంత?

మా పెళ్లి వచ్చే నెలలో గోవాలో జరుగుతుంది : కీర్తి సురేష్ (Video)

అజిత్ కుమార్ విడాముయర్చి టీజర్ ఎలా వుంది?

తర్వాతి కథనం
Show comments