ఓట్స్ ఇడ్లీ తయారీ విధానం...

Webdunia
బుధవారం, 28 నవంబరు 2018 (11:33 IST)
ఒట్టి బియ్యం పిండి ఇడ్లీలైతే చిన్నారుల నుండి పెద్దల వరకు వాటిని తినాలంటే విసుగుగా చూస్తుంటారు. అందుకు ఏం చేయాలో తెలియక స్త్రీలు ఆందోళన చెందుతుంటారు. ఓట్స్ అంటే నచ్చని వారుండరు. కాబట్టి వారికి నచ్చిన రీతిలోనే ఓట్స్‌తో ఇడ్లీ చేసిస్తే.. తప్పకుండా తింటారు. మరి ఆ వంట ఎలా చేయాలో చూద్దాం..
 
కావలసిన పదార్థాలు:
ఓట్స్ - 2 కప్పులు
పెరుగు - అరలీటర్
ఆవాలు - 2 స్పూన్స్
సెనగ పప్పు - 1 స్పూన్
మినపప్పు - 1 స్పూన్
పచ్చిమిర్చి - 2
క్యారెట్ తురుము - 1 కప్పు
కొత్తిమీర తరుగు - అరకప్పు
పసుపు - కొద్దిగా 
ఉప్పు - తగినంత
నూనె - సరిపడా.
 
తయారీ విధానం: 
ముందుగా బాణలిలో ఓట్స్ వేసి గోధుమ రంగు వచ్చేవరకూ నూనె లేకుండా వేయించుకోవాలి. ఆ తరువాత పొడి చేయాలి. అదే బాణలిలో నూనె వేసి వేడయ్యాక ఆవాలు, మినపప్పు, సెనగపప్పు వేసి వేగించి.. ఆ తరువాత పచ్చిమిర్చి, క్యారెట్ తురుము, కొత్తిమీర, పసుపు కలిపి 3 నిమిషాల పాటు వేయించాలి. ఈ మిశ్రమం చల్లారిన తరువాత పొడి చేసిన ఓట్స్, పెరుగు వేసి ఇండ్లీ పిండిలా కలుపుకోవాలి. నీళ్ల కలపకూడదు. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లకు నూనె రాసి పిండి నింపి ఆవిరి మీద 15 నిమిషాల పాటు ఉడికించాలి. అంతే... వేడి వేడి ఓట్స్ ఇడ్లీ రెడీ.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

తెలంగాణలోని బైంసాలో వరుస గుండెపోటులతో ఇద్దరు మృతి

పవన్ కల్యాణ్ నా చిరకాల మిత్రుడు, నేను ఆయనను ఏమీ అనలేదు, అనను: విజయసాయి రెడ్డి

ఆంధ్ర, తెలంగాణల్లో హాట్ టాపిక్ అదే.. కేటీఆర్-జగన్, రేవంత్-చంద్రబాబుల భేటీ

అమరావతిలో 25 బ్యాంకులకు ఒకే రోజు శంకుస్థాపన

ఏలూరు జిల్లాలో పవన్ పర్యటన... సమస్యలను ఏకరవు పెట్టిన స్థానికులు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vijay Sethupathi: విజయ సేతుపతి, పూరి జగన్నాథ్ సినిమా షూటింగ్ పూర్తి

Nikhil: నిఖిల్...స్వయంభు మహా శివరాత్రికి థియేటర్లలో రాబోతోంది

Balakrishna: మంచులో మేం సూట్ ధరిస్తే, బాలక్రిష్ణ స్లీవ్ లెస్ లో యాక్షన్ చేశారు : రామ్-లక్ష్మణ్

భారతీయ చిత్రపరిశ్రమలో ఒక శకం ముగిసింది : ధర్మేంద్ర మృతిపై ప్రముఖుల సంతాపం

Preethi Pagadala: సురేష్‌ బాబు సమర్పణలో కామెడీ స్పోర్ట్స్ డ్రామా పతంగ్‌ సిద్దం

తర్వాతి కథనం
Show comments