Webdunia - Bharat's app for daily news and videos

Install App

అరటిపువ్వుతో వడలు ఎలా..?

Webdunia
మంగళవారం, 27 నవంబరు 2018 (11:13 IST)
అరటిపువ్వులోని పోషకాలు చాలా. దీనిని రోజువారి ఆహారంగా తీసుకుంటే అనారోగ్యాలు దరిచేరవు. మధుమేహ వ్యాధిని అదుపులో ఉంచుతుంది. గుండె సంబంధిత వ్యాధులతో బాధపడేవారు.. అరటిపుప్పుతో తయారుచేసిన పదార్థాలు సేవిస్తే మంచిది. రక్తపోటును తగ్గిస్తుంది. ఇలాంటి అరటిపువ్వుతో వడలు ఎలా చేయాలో చూద్దాం...
 
కావలసిన పదార్థాలు:
అరటిపువ్వు తురుము - 2 కప్పులు
కందిపప్పు - అరకప్పు
శెనగపిండి - అరకప్పు
ఎండుమిర్చి - 5
పచ్చిమిర్చి - 2
అల్లం - చిన్న ముక్క
వెల్లుల్లి రెమ్మలు - 5
ఇంగువ - అరస్పూన్
పసుపు - పావు స్పూన్
సోంపు - ఒకటిన్నర స్పూన్
బియ్యం పిండి - పావుకప్పు
ఉల్లి తరుగు - 1 కప్పు
కరివేపాకు, కొత్తిమీర తరుగు - పావుకప్పు
ఉప్పు - తగినంతా
నూనె - వేయించడానికి సరిపడా.
 
తయారీ విధానం:
ముందుగా పప్పులను విడివిడిగా 3 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఎండుమిర్చి, సోంపు, వెల్లుల్లి, అల్లాన్ని మెత్తగా రుబ్బి ఆ తరువాత నానబెట్టిన పప్పులు వేసి కాస్త కచ్చాపచ్చాగా రుబ్బుకోవాలి. ఇక అరటిపువ్వు తురుము, కరివేపాకు, కొత్తిమీరు, పసుపు,  పచ్చిమిర్చి, ఇంగువ, ఉప్పు, ఉల్లి తరుగు, బియ్యం పిండి, పప్పుల మిశ్రమం వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు బాణలిలో నూనెను వేడిచేసి.. ఆ మిశ్రమాన్ని వడలుగా ఒత్తి నూనెలో దోరగా వేయించాలి. ఇవి స్నాక్స్‌గా తీసుకుంటే బాగుంటుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Vijayashanthi: కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా విజయశాంతి.. విజయం ఖాయమేనా?

అంతర్జాతీయ మహిళా దినోత్సవం: ISACA Hyderabad Chapter నిర్వహించిన SheLeadsTech ఈవెంట్

మహిళా కానిస్టేబుల్‍‌కు సీమంతం చేసిన హోం మంత్రి అనిత (Video)

ఖైరతాబాద్‌లో బంగ్లాదేశ్ అమ్మాయిలతో వ్యభిచారం.. ఎన్ఐఏ దర్యాప్తు

రైల్వే క్రాసింగ్ దాటేందుకు బైక్ ఎత్తిన బాహుబలి - వీడియో వైరల్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విశాల్‌తో కాదండోయ్.. నాకు నా బాయ్‌ఫ్రెండ్‌తో నిశ్చితార్థం అయిపోయింది.. అభినయ

హీరోయిన్ శ్రీలీలకు మెగాస్టార్ చిరంజీవి అరుదైన బహుమతి!!

దిల్ రూబా లో సరికొత్త ప్రేమ కథను చూస్తారు - దర్శకుడు విశ్వ కరుణ్

Vijayashanti: కళ్యాణ్ రామ్, విజయశాంతి మూవీ టైటిల్ అర్జున్ S/O వైజయంతి

Rukshar Dhillon: హాపీ ఉమన్స్ డే గా నటి రుక్సార్ ధిల్లాన్ ఘాటు విమర్శలు

తర్వాతి కథనం
Show comments