కొందరి అందంగా ఉండాలనుకుంటారు. అందుకు ఏవేవో మందులు వాడుతుంటారు. వీటితోనైన కాస్త అందంగా మారుతారని వారి నమ్మకం. కానీ, అలా జరగలేదు.. ఈ మందుల వాడకం వలన ఉన్న అందం కూడా మరీ హీనంగా మారిపోయింది. ఈ సమస్య నుండి విముక్తి లభించాలంటే.. ఈ చిట్కాలు పాటిస్తే సరి.
1. పెరుగులో కొద్దిగా కలబంద గుజ్జు, రోజ్ వాటర్ కలిపి ముఖానికి రాసుకోవాలి. అరగంట తరువాత వెచ్చని నీటితో కడుక్కోవాలి. ఇలా తరచుగా చేస్తే చర్మం నిగారింపు రెట్టింపవుతుంది.
2. ముక్కు దగ్గరి బ్లాక్‌హెడ్స్ తొలగించాలంటే.. మనం రోజూ పళ్లు తోముకునే పేస్ట్‌ని ముక్కుకు రాసుకోవాలి. ఇలా రోజూ చేస్తే నల్లటి వలాయలు పోతాయి.
3. చాలామందికి కాళ్లకు వెంట్రుకలు ఎక్కువగా ఉంటాయి. వాటిని తొలగించడానికి పార్లర్‌కు వెళ్తుంటారు. ఆ అవసరమే లేదు.. ఇంట్లోనే విడిపించవచ్చు.. ఎలా అంటే.. ముందుగా ఒక బౌల్‌లో నీటిని మరిగించుకుని అందులో కప్పు చక్కెర స్పూన్ నిమ్మరసం కలిపి అది గట్టిగా వచ్చేంతవరకు మరిగించాలి. ఈ చక్కెర మిశ్రమాన్ని కాళ్లకు రాసుకుని టిష్యూ పేపర్‌తో రిమూవ్ చేస్తే.. వెంట్రుకలు పోతాయి.
4. కొందరు బూట్లు తెగ వాడేస్తుంటారు. కానీ, వాటిని మాత్రం అస్సలు శుభ్రం చేసుకోరు.. ఈ చిట్కాతో ఎలా మరక తొలగించాలో చూద్దాం.. టూత్‌పేస్ట్‌ను బూట్లకు రాసుకును పొడి బట్టతో తుడిస్తే మరక పోతుంది. బూట్లు కొత్తగా మారుతాయి.
5. ముఖంపై మెుటిమలు విపరీతంగా ఉన్నప్పుడు టూత్‌పేస్ట్‌ను మెుటిమలపై రాసుకోవాలి. గంటపాటు అలానే ఉంచి ఆ తరువాత గోరువెచ్చని నీటితో కడుక్కోవాలి. ఇలా రోజూ చేస్తే మెుటిమ సమస్య ఉండదు.
6. జుట్టు రాలిపోతుందని బాధపడుతున్నారా.. వద్దు వద్దూ.. ఇలా చేస్తే చాలు.. మంచి ఫలితం ఉంటుంది. అరటిపండు గుజ్జులో కొద్దిగా టూత్‌పేస్ట్, వంటసోడా కలిపి తలకు అప్లై చేసుకోవాలి. రెండుగంటల తరువాత తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండుసార్లు చేయండి.. తప్పక ఫలితం ఉంటుంది.