అరటిపండు ఆరోగ్యానికి ఎంత మంచిదో దాని పువ్వు కూడా అంతే మంచిదని చెప్తున్నారు నిపుణులు. అరటిపువ్వు జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. ఈ పువ్వులోని ఐరన్, పొటాషియం, మెగ్నిషియం, పాస్పరస్, క్యాల్షియం వంటి ఖనిజాలు నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతాయి. అరటిపువ్వుతో ఇలా కూర చేసుకుని తీసుకుంటే శరీరానికి కావలసిన పోషక విలువలు పుష్కలంగా అందుతాయి.
అరటిపువ్వును కట్ చేసుకుని అందులో కొద్దిగా నీరు, కారం, ఉప్పు, చింతపండు, పచ్చిమిర్చి వేసి లేతగా ఉడికించుకోవాలి. ఈ మిశ్రమాన్ని వేడి వేడి అన్నంలో కలిపి సేవిస్తే చాలా రుచిగా ఉంటుంది. దీనిని ఉడికించేటప్పుడు తేలికగా ఉడికించాలి లేదంటే దానిలో విటమిన్ బి బయటకు పోతుంది. విటమిన్ బి కంటి చూపును మెరుగుపరుస్తుంది.
ఆయుర్వేదం ప్రకారం అల్సర్ వ్యాధికి అరటిపువ్వునే ఎక్కువగా వాడుతుంటారు. అలానే మహిళల్లో బహిష్టు సమయంలో అధికస్రావం అరికట్టడానికి, మగవారిలో వీర్యవృద్ధికి అరటిపువ్వు చాలా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా స్త్రీలకు తెల్లబట్టను కూడా నివారిస్తుందని చెప్తున్నారు. కనుక రోజూవారి ఆహారంలో తరచుగా అరటిపువ్వుతో తయారుచేసిన వంటకాలు తీసుకుంటే ఈ సమస్యల నుండి వెంటనే ఉపశమనం లభిస్తుంది.