Webdunia - Bharat's app for daily news and videos

Install App

వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారా..? ఈ వాస్తు చిట్కాలు పాటిస్తే.. సూపర్ ఫలితాలు

సెల్వి
గురువారం, 6 మార్చి 2025 (09:47 IST)
Work from home
వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారా.. అయితే ఈ వాస్తు చిట్కాలు పాటించండి. ఈ వాస్తు చిట్కాలను పాటించడం ద్వారా ప్రొడక్షన్ పెరగడంతో పాటు పాజిటివ్ ఎనర్జీ లభిస్తుంది. ఇంటి నుండి పని చేసే సెటప్‌లో పనిచేసే వారికి వాస్తు విషయాలను గుర్తు పెట్టుకోవాలని వాస్తు నిపుణులు వివరిస్తున్నారు. కంప్యూటర్ డెస్క్‌కు సంబంధించిన వాస్తును పాటిస్తే సానుకూల విషయాలు జరుగుతాయని విశ్వాసం.
 
వాస్తు నమ్మకం అన్ని విషయాలలోనూ కనిపిస్తుంది. ఇంటి నిర్మాణ సమయంలోనే కాకుండా ఇంటి నిర్మాణం తర్వాత కూడా వాస్తు వివరాలను పాటిస్తారు. ఇంట్లో ఉంచే వస్తువుల నుండి గోడకు వేలాడదీసే ఫోటోల వరకు, వాస్తు విషయాలను తప్పక పాటిస్తారు. ఆ విధంగా, ఇంటి నుండి పనిచేసే వారు తమ కార్యాలయ సెటప్‌ను ఏ దిశలో ఉంచాలో, దానికి వాస్తు ఏమిటో చూడగలరు.
 
వాస్తు నిపుణుల సలహా ప్రకారం ఇంటికి దక్షిణం లేదా పడమర దిశలో కంప్యూటర్ లేదా ల్యాప్‌టాప్ ఉంచడం మంచిది. ఈ దిశలలో ఉంచినప్పుడు, సానుకూల శక్తి ప్రవహించడమే కాకుండా, మనస్సు కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఇది విద్యార్థులలో శ్రద్ధను పెంచుతుంది. ఉద్యోగులకు పనిలో విజయాన్ని అందిస్తుంది. మనం పనిచేసే ఎలక్ట్రానిక్స్‌ను సరైన దిశలో ఉంచితే, కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు కూడా మెరుగుపడతాయి.
 
పరిశుభ్రత ముఖ్యం
కంప్యూటర్ డెస్క్‌ను ఎల్లప్పుడూ శుభ్రంగా మరియు ఎటువంటి చెత్త లేకుండా ఉంచండి. మనం తరచుగా ఉపయోగించే కాగితాలు, ఫైళ్లు డెస్క్ మీద పేరుకుపోతే, ప్రతికూల శక్తి పెరిగే అవకాశం ఉంది. దీనివల్ల పనిలో జాప్యం జరగడమే కాకుండా ఒత్తిడి కూడా పెరుగుతుంది. కాబట్టి టేబుల్‌ను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవడం మంచిది.
 
ప్రోత్సాహకరమైన మాటలు
మీ కంప్యూటర్ డెస్క్‌పై ప్రేరణాత్మక చిత్రాలు లేదా ప్రేరణాత్మక కోట్‌లను కలిగి ఉండటం ప్రేరణకు గొప్ప మూలం కావచ్చు. ఇవి మనసును ఆహ్లాదపరచడానికి ఉపయోగపడతాయి. ప్రేరణ పొందడానికి ఇది ఒక గొప్ప మార్గం, మీరు ఎప్పుడైనా అలసిపోయినట్లు అనిపిస్తే, మీ ముందు ఉన్న ప్రోత్సాహకరమైన మాటలు మీకు స్ఫూర్తినిస్తాయి.
 
అద్దాలు వద్దు
మీ కంప్యూటర్ డెస్క్ మీద అద్దాలు పెట్టకూడదు. అద్దాలు ప్రతిబింబాలను సృష్టిస్తాయి. ప్రతికూల శక్తిని పెంచుతాయి. ఇది మనస్సును అస్థిరంగా మార్చుతుంది. ఏకాగ్రతను తగ్గిస్తుంది. కాబట్టి టేబుల్ మీద అద్దాలు పెట్టకుండా జాగ్రత్త వహించడం మంచిది.
 
పదునైన వస్తువులు
కంప్యూటర్ డెస్క్‌పై కత్తులు వంటి పదునైన వస్తువులను ఉంచడం వల్ల ప్రతికూల పరిణామాలు ఉంటాయి. ఇవి మనశ్శాంతిని దూరం చేస్తాయని వాస్తు నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా కార్యాలయంలో ప్రశాంతమైన వాతావరణాన్ని సృష్టించడానికి, అటువంటి పదునైన వస్తువులను డెస్క్‌పై ఉంచకూడదు.
 
సరైన వాస్తు నియమాలను పాటించడం వల్ల ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుంది. విద్యార్థుల శ్రద్ధ, జ్ఞాపకశక్తి మెరుగుపడతాయి. ఉద్యోగులు తమ ఉద్యోగాలలో విజయం సాధించగలరు. ఇంకా, కుటుంబ సభ్యుల మధ్య అనురాగ బంధం పెరుగుతుంది. ఇంట్లో శాంతి ఉంటుంది.
 
సరైన వాస్తు నియమాలను పాటించడం ద్వారా, జీవితంలో మంచి మార్పులు తీసుకురాగలరని విశ్వాసం. కాబట్టి మీ కంప్యూటర్ డెస్క్ లేదా ల్యాప్‌టాప్ టేబుల్‌ను సరైన దిశలో గురిపెట్టి విజయం సాధించండి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాక్‌కు యుద్ధ భయం.. లాగు తడిసిపోతోంది... చడీచప్పుడు లేకుండా ఉగ్రవాదుల తరలింపు!!

2025 HCLTech గ్రాంట్‌ను ప్రకటించిన HCL ఫౌండేషన్

జిమ్‌లో వర్కౌట్ చేస్తుంటే గాయపడిన కేటీఆర్!!

తెలియకుండానే పహల్గాం ఉగ్రదాడిని వీడియో తీసిన టూరిస్ట్ (Video)

దారుణం, వెనుక తూటాలకు బలవుతున్న పర్యాటకులు, ఆకాశంలో కేరింతలు కొడుతూ వ్యక్తి (video)

అన్నీ చూడండి

లేటెస్ట్

26-04-2015 శనివారం ఫలితాలు - ఓర్పుతో యత్నాలు సాగించండి...

అప్పుల బాధలను తీర్చే తోరణ గణపతి పూజ ఎలా చేయాలి?

25-04-2015 శుక్రవారం ఫలితాలు - అనుమానిత వ్యక్తులతో సంభాషించవద్దు..

Saturn moon conjunction: మీనరాశిలో చంద్రుడు, శని.. ఎవరికి లాభం?

Simhachalam: ఏప్రిల్ 30న అప్పన్న స్వామి నిజరూప దర్శనం-ఆన్‌లైన్ బుకింగ్‌లు

తర్వాతి కథనం
Show comments