Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Camphor And Clove: కర్పూరం, లవంగాలను కలిపి వెలిగిస్తే?

Advertiesment
cloves-camphor

సెల్వి

, బుధవారం, 12 ఫిబ్రవరి 2025 (14:29 IST)
జీవితంలో సంపదలు చేకూరాలంటే.. డబ్బుకు లోటు వుండకూడదంటే.. కర్పూరం, లవంగాలు చాలు అంటున్నారు వాస్తు నిపుణులు. డబ్బు అవసరాలను తీరుస్తుంది. సంతృప్తిని, మనశ్శాంతిని ఇస్తుంది. సానుకూల శక్తితో ఇళ్లు నిండివుండాలంటే.. కొన్ని చిట్కాలు పాటించాలి. 
 
వాస్తు ప్రకారం లక్ష్మీదేవి అనుగ్రహం కోసం కర్పూరాన్ని, లవంగాలను కలిపి వెలిగించాలి. లవంగాలు, కర్పూరం సానుకూల శక్తిని పెంచుతుంది. వీటిని వెలిగించడం ద్వారా వచ్చే వాసన శ్రీ మహాలక్ష్మికి చాలా ఇష్టమని వాస్తు నిపుణులు అంటున్నారు. తద్వారా సానుకూల ఫలితాలు లభిస్తాయి. 
 
సంపద చేకూరుతుంది. లవంగాలు, కర్పూరం కలిపి వెలిగించడం ద్వారా అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. కర్పూరంలో, లవంగాలు వెలిగించడంతో మానసిక ఒత్తిడి, ఆందోళన దూరమవుతుంది. ఏకాగ్రత పెరుగుతుంది. రాత్రి పూట కర్పూరం, లవంగాలను కలిపి వెలిగించడం ద్వారా ప్రతికూల ప్రభావం తగ్గుతుంది. సానుకూలత పెరుగుతోంది. లవంగాలతో కర్పూరం కాల్చడం వల్ల ఇంటికి శాంతి, ఆనందం చేకూరుతాయి.
 
కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ-ఆప్యాయత ఎల్లప్పుడూ ఉంటుంది. అంతేకాకుండా, రాత్రిపూట కర్పూరం, లవంగాలు వెలిగించడం వల్ల ఇంట్లో సంపద పెరిగిపోయే అవకాశాలు పెరుగుతాయి. అడ్డంకులు తొలగిపోతాయి. 
 
ఆర్థిక సమస్యలు తీరాలంటే... ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనే వారు ఓ సిల్వర్ పాత్రలో కర్పూరం, లవంగాలు వేసి.. నిద్రపోయేందుకు ముందు వెలిగించాలి. ఇలా రోజూ చేయడం ద్వారా ఇంట్లోని ప్రతికూల ప్రభావం తొలగిపోతాయి. ఇంకా ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. అలాగే వివాహ అడ్డంకులు మటాష్ అవుతాయని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Magha Purnima 2025 : మాఘ పూర్ణిమ రోజున సాయంత్రం ఇలా చేస్తే?