Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇంట్లో కనకవర్షం కురవాలంటే.. పచ్చకర్పూరం, లవంగాలు చాలు

Advertiesment
cloves-camphor

సెల్వి

, శుక్రవారం, 27 సెప్టెంబరు 2024 (18:20 IST)
cloves-camphor
ఇంట్లో కనకవర్షం కురవాలంటే.. పచ్చకర్పూరం, లవంగాలు మాత్రం చాలునని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. ధనం లేనిదే పొద్దుగడిచేది లేని పరిస్థితి. సుఖసంతోషాలతో, అష్టైశ్వర్యాలతో తులతూగడం కోసం ప్రయత్నించని వారంటూ వుండరనే చెప్పాలి. ధనం ప్రస్తుతం అత్యవసరంగా మారిపోయింది. 
 
అయితే ఈ ధనం అనేది కొందరికి లభిస్తుంది. చాలామందికి దూరంగా వుంటోంది. ధనం కోసం తీవ్రంగా శ్రమించే వారి సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోంది. ధనవంతులు.. ధనవంతులుగానూ.. పేదలు పేదలుగానే మిగిలిపోతున్నారు. 
 
అయితే పేదలు ధనవంతులు కావాలంటే.. సులభమైన పరిహారాలు చేస్త సరిపోతుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. ఇంట్లో ప్రతికూలతను తొలగించి.. శ్రీ మహాలక్ష్మీ దేవి కటాక్షం లభించాలంటే.. కొన్ని పరిహారాలు చేస్తే సరిపోతుంది అంటున్నారు.. ఆధ్యాత్మిక పండితులు. ముందుగా అందుకు వాస్తు శాస్త్రాన్ని పాటించాలి. 
 
వాస్తు సరిగ్గా వుంటేనే శ్రీలక్ష్మి ఆ ఇంట నివాసం వుంటుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. ఇందులో ముఖ్యంగా కర్పూరంలో లవంగాలను కలిపి హారతి ఇవ్వడం ద్వారా శ్రీలక్ష్మి అనుగ్రహం లభిస్తుంది. సుగంధ ద్రవ్యాలైన ఈ రెండూ లక్ష్మికి చాలా ఇష్టం. ఈ రెండింటిని కలిపి వెలిగించడం ద్వారా ఆ వాసన, పొగ ఇంట్లోని 
 
ప్రతికూలతను తొలగిస్తుందని విశ్వాసం. ఇంకా ఈ రెండింటిని వాసనతో లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని నమ్మకం. ఇంకా సంపదన పెరుగుతుంది. ఆదాయానికి మార్గం సుగమమవుతుంది. ఇంకా ఈ రెండింటి వాసన ద్వారా ఇంట్లోని వారికి సానుకూల ఫలితాలు వుంటాయి. కుటుంబ సభ్యులకు మానసిక ఒత్తిడి దూరం అవుతుంది. ఏకాగ్రత పెరుగుతుంది. రాత్రిపూట అంటే సంధ్యాకాలం దీపం వెలిగించేటప్పుడు లవంగాలు.. కర్పూరాన్ని వెలిగించడం ద్వారా ఇంట శుభ ఫలితాలు చేకూరుతాయి. కార్యానుకూలత, తలపెట్టిన కార్యాల్లో విజయం లభిస్తుంది. అలాగే కుటుంబంలో ప్రశాంతత చేకూరుతుంది. కుటుంబంలో ఐక్యత, సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయి. 
 
ఒకవేళ మీరు ఆర్థిక ఇబ్బందుల్లో సతమతమవుతుంటే.. ఓ పాత్రలో కర్పూరం, లవంగాలను వుంచి రాత్రి పూట నిద్రించేందుకు ముందు వెలిగించాలి. ఇలా ప్రతిరోజూ చేయడం ద్వారా ఇంట్లోని ప్రతికూలతలు తొలగిపోతాయి. 
 
ఆర్థిక ఇబ్బందులు తొలగి.. ధనాదాయం వుంటుంది. రుణబాధలు తొలగిపోతాయి. సంతానప్రాప్తి వుంటుంది. అలాగే వివాహ అడ్డంకులు తొలగిపోతాయి. వాస్తు దోషాలు తొలగిపోతాయని ఆధ్యాత్మిక పండితులు సెలవిస్తున్నారు.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

27-09-2024 శుక్రవారం దినఫలితాలు : శకునాలు పట్టించుకోవద్దు...